Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: May 23, 2019, 12:31 PM IST
మమతా బెనర్జీ (Image : File)
బెంగాల్ లోక్ సభ ఎన్నికల సమరంలో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుకున్నా... బీజేపీ దూసుకురావడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశం. ఎట్టి పరిస్థితుల్లో తృణమూల్ని సాగనంపి... తామే సత్తా చాటుతామన్న కమలనాథులకు ఆ అవకాశం దక్కకపోయినా... మరోసారి తనదే పైచేయి అయ్యేలా చెయ్యడంలో కొంతవరకూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించినా... కమలం వికసిస్తుండటం చెప్పుకోతగ్గ అంశం. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ... అనూహ్యంగా పుంజుకొని... 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే బీజేపీ ఈ స్థాయిలో పోటీ ఇవ్వడం చెప్పుకోతగ్గ అంశమే. ఎందుకంటే... బెంగాల్లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా... ఏడు దశల్లో జరిగిన ఎన్నికలు జరిగాయి. చివరి దశకు ముందు హింస చెలరేగడంతో... ఎన్నికల ప్రచారాన్ని గడువు కంటే ఒక రోజు ముందే ముగించాలని ఈసీ ఆదేశించాల్సిన పరిస్థితి తలెత్తింది.
2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో.. తృణమూల్ కాంగ్రెస్ 34 గెలుచుకోగా... ఈసారి 9 స్థానాల్లో వెనకబడింది. అప్పట్లో NDA 2 స్థానాలు సాధించగా... ఈసారి బీజేపీ జోరందుకుని 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగడం చెప్పుకోతగ్గ విషయమే. దీంతో బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను పక్కకు నెట్టి బీజేపీ ముందుకు వచ్చినట్లైంది. ఇలాగే కొనసాగితే 2021లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఐతే... దేశం మొత్తం మరోసారి బీజేపీ హవా కనిపించడంతో... ప్రధాని కావాలనుకున్న మమతా బెనర్జీ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇక ఇప్పుడు ఆమె... తన సొంత రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఇవి కూడా చదవండి :
రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...
లగడపాటి సర్వే సన్యాసమేనా... RG ఫ్లాష్ టీమ్ ఫసక్...
ఏపీ ఉద్యోగుల సెగ... టీడీపీకి మరోసారి షాక్...
First published:
May 23, 2019, 12:31 PM IST