సీఎం మమతా బెనర్జీ నన్ను అవమానించింది...బెంగాల్ గవర్నర్ ఆవేదన

దుర్గాపూజ ఉత్సవంలో ప్రముఖుల పక్కన స్థానం ఇవ్వకుండా అవమానించారని ఆయన మీడియా ముందు తెలిపారు.

news18-telugu
Updated: October 15, 2019, 10:08 PM IST
సీఎం మమతా బెనర్జీ నన్ను అవమానించింది...బెంగాల్ గవర్నర్ ఆవేదన
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్
news18-telugu
Updated: October 15, 2019, 10:08 PM IST
దుర్గాపూజ వేదికపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గాపూజ ఉత్సవంలో వేదికపై తనను కూర్చోపెట్టలేదని, టీవీలో సైతం తనను కనబడకుండా చేశారని ఆయన వాపోయారు. దుర్గాపూజ ఉత్సవంలో ప్రముఖుల పక్కన స్థానం ఇవ్వకుండా అవమానించారని ఆయన మీడియా ముందు తెలిపారు. అంతే కాదు తనను వేదికపైన ఒక మూల కూర్చోపెట్టారని, కార్యక్రమాన్ని తాను చూడలేకపోయానని ఆయన తెలిపారు. ఈ సంఘటన తనను కలచివేసిందని, బాధతో ఈ విషయం చెబుతున్నానని ఆయన గద్గదస్వరంతో పేర్కొన్నారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...