మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో హోమ్ డెలివరీ..?

ప్రతీకాత్మక చిత్రం

మద్యాన్ని లాక్‌డౌన్ సమయంలో హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది.

 • Share this:
  మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి మద్యాన్ని హోమ్ డెలివరీ చేయనున్నారు. కాకపోతే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్.. పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క అవస్థలు పడుతుండడాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మద్యాన్ని లాక్‌డౌన్ సమయంలో హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తుందా.. లేదా.. అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

  అయితే లాక్‌డౌన్ వల్ల మూసేసిన మద్యం దుకాణాలను ఎట్టిపరిస్థితుల్లో తెరిచేదిలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి మాత్రమే వైన్స్‌ల నుంచి హోం డెలివరీ చేయనున్నట్టు తెలిపారు. మద్యం విక్రయించేవారికి హోం డెలివరీకి సంబంధించిన పాసులను స్థానిక పోలీసు స్టేషన్లలో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాసుల కోసం వైన్స్‌ల యాజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాల్సి ఉంటుంది.

  ఒక్కో దుకాణానికి మూడు డెలివరీ పాసులు ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాత్రమే వినియోగదారులు తమ మొబైల్స్ నుంచి మద్యాన్ని ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో సరఫరా చేసేలా ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. మందుబాబులకు పండగే.
  Published by:Narsimha Badhini
  First published: