హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Exams: ఎగ్జామ్ రాస్తూ కళ్లు తిరిగి పడిపోయిన స్టూడెంట్! పోలీసులు ఏం చేశారో తెలుసా..?

Exams: ఎగ్జామ్ రాస్తూ కళ్లు తిరిగి పడిపోయిన స్టూడెంట్! పోలీసులు ఏం చేశారో తెలుసా..?

ఆస్పత్రిలో మిమునా

ఆస్పత్రిలో మిమునా

క్వశ్చన్ పేపర్‌ తీసుకోని కాసేపు ఆన్సర్ షీట్ ఫిల్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని ఆన్సర్స్ రాసిన తర్వాత అస్వస్థతకు గురైన మిమునా ఉన్నట్టుండి కిందపడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పరీక్షలంటేనే చాలా మంది విద్యార్థుల్లో ఒకటే భయం.. ఎగ్జామ్‌ సరిగ్గా రాస్తమో లేదో.. మనం చదవిన క్వశ్చన్సే వస్తాయో లేదో.. పేపర్‌ కష్టంగా ఇస్తే ఏం చేయాలో ఏమో.. ఇలా పరీక్ష మొదలవకముందే టెన్షన్ పడే విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఎగ్జామ్‌ భయంతో కొంతమంది ఫుడ్‌ కూడా సరిగ్గా తినరు. టైమ్‌కి పడుకోరు.. ఓవర్‌ టైమ్‌ అని.. నైట్ అవుట్‌ అని భయంతో పుస్తకల ముందే కూర్చుంటారు. తీరా ఎగ్జామ్‌ హాల్‌లోకి వెళ్లిన తర్వాత లో బీపీతో కళ్లు తిరిగి పడిపోతారు. మరికొంత ఎగ్జామ్‌ ఫియర్‌తో సరిగ్గా తినక అనారోగ్యంతోనే పరీక్ష రాయడానికి వస్తారు. అలా వచ్చి కళ్లు తిరగి కిందపడిపోయిన ఘటనలు చాలానే చూశాం.. అలాంటి ఘటనే పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది.

ఎగ్జామ్‌ హాల్‌లో అన్‌ఈజీ:

మధ్యమిక్ అభ్యర్థి మిమునా (18)ను ఆమె తండ్రి రియాజుల్ హక్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. ఎగ్జామ్‌ సెంటర్‌కు వచ్చేటప్పటికే ఆమె చాలా అన్‌ఈజీగా ఉన్నట్లు తండ్రికి చెప్పింది. అయితే పరీక్ష మాత్రం రాస్తానని.. ఏం కంగారు పడొద్దని తండ్రికి చెప్పి సెంటర్‌లోకి వెళ్లిపోయింది. పరీక్ష హాల్‌లోకి ఎంటర్ ఐనప్పటి నుంచి తల తిరుగుతున్నట్లు అనిపించింది. అయితే తన ఎగ్జామ్‌ బెంచ్‌ మీద కుర్చోని ఎలాగోలా పరీక్ష రాయడానికి సిద్ధమైంది. క్వశ్చన్ పేపర్‌ తీసుకోని కాసేపు ఆన్సర్ షీట్ ఫిల్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని ఆన్సర్స్ రాసిన తర్వాత అస్వస్థతకు గురైన మిమునా ఉన్నట్టుండి కిందపడిపోయింది.

పోలీసుల సాయం:

అస్వస్థతకు గురైన బాలికను వెస్ట్ పోర్ట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు మాధ్యమిక్ పరీక్షా కేంద్రం నుంచి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే ఆమెను బీఎన్ఆర్ సెంట్రల్ ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. గంట తర్వాత డిశ్చార్జ్ అయిన మిమునాను తిరిగి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి ఎడ్యుకేషన్ బోర్డుతో సమన్వయం చేసుకుని బాలిక లైఫ్ సైన్స్ పరీక్ష పూర్తయ్యేలా చూశారు పోలీసులు. ఇంత స్పీడ్‌గా స్పందించి విద్యార్థి ఎగ్జామ్‌ రాసేందుకు అన్నివిధాల సాయం చేసిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలకు వచ్చే ముందు కేవలం చదువుమీదే కాకుండా ఫుడ్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఎంత బాగా చదివినా హెల్త్ సరిగ్గా లేకపోతే ఎలాంటి ఎగ్జామ్‌ కూడా రాయలేమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా డీహైడ్రెట్ కాకుండా వాటర్‌ తాగాలని చెబుతున్నారు.

First published:

Tags: Exams, Police, Student

ఉత్తమ కథలు