Home /News /national /

WEST BENGAL FISHERMAN SELLS 55 KG TELIA FISH IN WHOPPING 13 LAKH RUPEES HERE IS ITS SPECIALTY SK

Rs.13 Lakhs Fish: వలలో పడిన ఆ ఒక్క చేప.. పేద మత్స్యకారుడిని లక్షాధికారి చేసింది

తెలియా భోలా చేప

తెలియా భోలా చేప

Fish sold for Rs.13 Lakhs: తెలియా భోలా చేప కిలోకు ఏకంగా 26వేలు ఎందుకు పలికిందో తెలుసా? తెలియా భోలా జాతికి చెందిన చేపల్లో ఔషణ గుణాలు ఎక్కువగా ఉంటాయి.అనేక రకాల మందుల తయారీలో ఈ చేపలను వినియోగిస్తారు.

    సముద్ర గర్భంలో ఎన్నో జాతుల జలచరాలు జీవిస్తున్నాయి. అందులో  చేపలే ఎక్కువగా ఉంటాయి. చేపల్లోనూ వందల రకాలుంటాయి. అందులో కొన్ని చేపల మత్స్యకారులకు అదృష్టం తీసుకొస్తాయి. రాత్రికి రాత్రే జీవితాన్ని మార్చేస్తాయి. భారీ రేటు పలికి.. లక్షాధికారిని చేస్తాయి. పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో కూడా ఓ మత్స్యకారుడి పంట పండింది. తన వలలో పడిన చేప భారీ రేటుకు అమ్ముడపోయింది. ఏకంగా లక్షల పలకడంతో అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. ఈస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన ఓ జాలరి అందరిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లాడు. ఐతే అతడి వలకు తెలియా భోలా (Telia Bhola Fish) జాతికి చెందిన భారీ చేప చిక్కింది.  దాని బరువు ఏకంగా 50 కేజీలు ఉంది. అంత పెద్ద చేప చిక్కడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేవు. అందులోనూ అది 'తెలియా భోలా' చేప కావడంతో..  పండగ చేసుకున్నాడు.

    Viral Mark Sheet : ఆటో డ్రైవర్ కొడుకు మార్క్ షీట్ చూసి అవాక్కయిన ప్యాసింజర్



    50 కేజీల ఆ భారీ చేపను తూర్పు భారతదేశంలో అతి పెద్ద చేపల వేలం కేంద్రమైన దిఘా మోహన ఫిష్ ఆక్షన్ సెంటర్‌లో వేలం వేశారు. వేలంలో ఆ చేపను చేజిక్కించుకునేందకు ఎంతో మంది వ్యాపారవేత్తలు పోటీపడ్డారు. మూడు గంటల పాటు వేలం ప్రక్రియ సాగింది. చివరకు దక్షిణ 24 పరగణాల జిల్లా నైనాన్ ప్రాంతానికి చెందిన శివాజీ కబీర్.. భారీ రేటు పెట్టి.. దానిని దక్కించుకున్నాడు. కిలోకు రూ.26వేల చొప్పున..13 లక్షలు (Fish sold for 13 lakhs) చెల్లించి.. కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఆ చేప బరువు 55 కేజీలు ఉంది. ఐతే అందులో 5 కేజీల మేర గుడ్డు ఉండడంతో.. దానిని మినహాయించి మిగతా 50 కేజీలకు డబ్బులు చెల్లించారు. ఒక్క చేపతో 13 లక్షల రావడంతో ఆ మత్స్యకారుడి ఆనంధానికి అవధుల్లేవు. ఇంత పెద్ద చేప దొరికిందని తెలియడంతో.. దానిని చూసేందుకు చుట్టు పక్కల వారు భారీగా తరలి వచ్చారు.

    పిల్లలు చనిపోతే చెట్లుగా మారుతారు... ఇలాంటి సంప్రదాయాన్ని ఎక్కడా చూసి ఉండరు

    అంత రేటు ఎందుకు?
    సాధారణందా చేపల ధర వాటి రకాన్ని బట్టి రూ.100 నుంచి 1000 వరకు ఉంటుంది. కానీ ఈ చేప కిలోకు ఏకంగా 26వేలు ఎందుకు పలికిందో తెలుసా? తెలియా భోలా జాతికి చెందిన చేపల్లో ఔషణ గుణాలు ఎక్కువగా ఉంటాయి.అనేక రకాల మందుల తయారీలో ఈ చేపలను వినియోగిస్తారు. రోగుల ప్రాణాలు కాపాడే పలు ఔషధాల్లో వీటిని వాడుతారు. చేపల్లో అత్యంత ఖరీదైనదిగా వీటికి పేరుంది. ఈ చేపలు ఎవరి వలకైనా చిక్కాయని తెలిస్తే.. వాటిని దక్కించుకునేందకు పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడతుంటాయి. విదేశీ కంపెనీలు కూడా భారీ రేటును పెట్టేందుకు ముందుకొస్తాయి. ఇంత రేటున్న తెలియా భోలా చేపల కోసం మత్స్యకారులు చాలా ప్రయత్నాల చేస్తుంటారు. కానీ ఎవరికో ఒకరికరి మాత్రమే చాలా అరుదుగా దొరుకుతుంటాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Fish, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు