Home /News /national /

West Bengal Election Result: మమత బెనర్జీకి టెన్షన్.. దూసుకొస్తున్న బీజేపీ.. బెంగాల్‌లో టఫ్ ఫైట్..

West Bengal Election Result: మమత బెనర్జీకి టెన్షన్.. దూసుకొస్తున్న బీజేపీ.. బెంగాల్‌లో టఫ్ ఫైట్..

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

West Bengal Election Result: ఓ వైపు రాష్ట్రంలో ఫలితాలు హోరాహోరీగా ఉండగా.. మరోవైపు నందిగ్రామ్‌లోనూ మమతకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో.. తుది ఫలితాలు ఏ రకంగా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

    ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బెంగాల్ ఫలితాలు ఉండబోతున్నట్టు ఓట్ల లెక్కింపు సరళిని బట్టి అర్థమవుతోంది. మొత్తం 292 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటివరకు 134 స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా.. అందులో టీఎంసీ 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక టీఎంసీతో అమీతుమీ అన్నట్టుగా పోటీ పడుతున్న బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. లెఫ్ట్ పార్టీలు 2, ఇతరులు ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నారు. ఇక మమత బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లోనూ పరిస్థితి హోరాహోరీగానే ఉంది. ఇక్కడ మమతపై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి పలు రౌండ్లలో ఆమెపై ఆధిక్యత కనబర్చడం తృణమూల్ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఓ వైపు రాష్ట్రంలో ఫలితాలు హోరాహోరీగా ఉండగా.. మరోవైపు నందిగ్రామ్‌లోనూ మమతకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో.. తుది ఫలితాలు ఏ రకంగా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: 5 State Elections, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు