మమతా బెనర్జీతో చర్చలు సఫలం.. బెంగాల్లో డాక్టర్ల సమ్మె విరమణ

Doctors Strike | మమతా బెనర్జీతో వైద్యుల చర్చలు ఫలించాయి. వారి డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో వారం రోజులుగా సాగుతున్న నిరసనలకు ఫుల్ స్టాప్ పడింది.


Updated: June 17, 2019, 6:30 PM IST
మమతా బెనర్జీతో చర్చలు సఫలం.. బెంగాల్లో డాక్టర్ల సమ్మె విరమణ
మమతా బెనర్జీ (File)
  • Share this:
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను విరమించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వైద్యుల ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు. కోల్‌కతాలోని NRS ఆస్పత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ల మీద పేషెంట్ బంధువులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. అది దేశవ్యాప్తంగా పాకింది. ఏకంగా భారత వైద్య సంఘం ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చేవరకు వెళ్లింది. ఈ క్రమంలో వైద్యుల బృందంతో మమతా బెనర్జీ చర్చలు జరిపారు. మొత్తం 31 మంది ప్రతినిధులు మమతా బెనర్జీతో చర్చలకు హాజరయ్యారు. బెంగాల్‌కు చెందిన ఒక మీడియా చానల్‌ సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వైద్యులు ప్రధానంగా 12 డిమాండ్లు పెట్టినట్టు తెలిసింది. వాటిని మమతా బెనర్జీ అంగీకరించారు. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగింది.

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన... దాడిని నిరసిస్తూ ధర్నా


ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభ్యంతరాలను తెలిపే యూనిట్లు నెలకొల్పేందుకు సీఎం అంగీకారం తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత పెంచడానికి అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు పోలీసులను సస్పెండ్ చేసినట్టు మమతా బెనర్జీ చెప్పారు. తాము ఏ డాక్టర్ మీద కూడా కేసులు పెట్టలేదన్నారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు ఎందుకు పనిచేయడం లేదని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎందుకు కొనడం లేదంటూ అధికారులకు క్లాస్ పీకారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు