Home /News /national /

WEST BENGAL CM MAMATA BANERJEE YOUNGER BROTHER ASHIM BANERJEE SUCCUMBS TO COVID 19 SU

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో విషాదం..

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఆమె సోదరుడు అషీమ్ బెనర్జీ కన్నమూశారు.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ఆమె సోదరుడు అషీమ్ బెనర్జీ కన్నమూశారు. దాదాపు నెల రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. మెడికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి అషీమ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో.. అషీమ్ మే 15న మృతిచెందారు. అషీమ్ మరణించిన విషయాన్ని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ ధ్రువీకరించినట్టు ANI పేర్కొంది. ఇక, అషీమ్ బెనర్జీ.. కాళీ ఘాట్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. అతని స్థానికులు Kalida అని పిలిచేవారు. కోవిడ్ నిబంధనల ప్రకారం శనివారం అషీమ్ బెనర్జీ అంత్యక్రియలు నిర్వహించచనున్నారు. మరోవైపు అషీమ్ ఈ రోజు ఉదయం 9.20 గంటల ప్రాంతంలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు.

    కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణంకాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం 1,31,792 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 9,50,017 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 12,993 మంది కరోనాతో మృతిచెందారు.

    ఇక, దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజ‌ృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. కొత్తగా 3,890 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,66,207కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.07 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,53,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,04,32,898కి చేరింది. రికవరీ రేటు 83.8 శాతంగా ఉంది. రికవరీ రేటు పెరుగుతుండటం మంచి విషయం. ప్రస్తుతం భారత్‌లో 36,73,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Mamata Banerjee, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు