జపాన్ (Japan) మాజీ ప్రధాని షింజో అబే (Shinzeo Abe) దారుణ హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న అబేపై దుండుగుడు కాల్పులు జరపడంతో.. ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఐతే షింజో అబే హత్యను ఇటీవల కేంద్ర పథకం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు (Agneepath Scheme) లింక్ చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 'జాగో బంగ్లా' సంచలన కథనాన్ని ప్రచురించింది. జగో బంగ్లా పత్రిక.. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినది. టీఎంసీ మౌత్ పీస్‌లో ఇలాంటి కథనం రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు అందులో ఏముందో ఇక్కడ చూద్దాం.
Shinzo Abe Death: అందుకే షింబో అబేను షూట్ చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
'షింజో అబే హత్యలో అగ్నిపథ్ ఛాయ' అనే హెడ్‌లైన్‌తో జాబో బంగ్లా ఈ కథనాన్ని ప్రచురించింది. షింజో హత్య... భారత దేశంలో అగ్నిపథ్ పథకంపై వస్తున్న వ్యతిరేకతను బలపరుస్తోందని పేర్కొంది. ఎందుకంటే షింజో అబేను హత్యచేసిన వ్యక్తి కూడా గతంలో పెన్షన్ లేకుండానే సైన్యంలో పనిచేశాడని తెలిపింది. అగ్నిపథ్ పథకం వల్ల మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితులు రావచ్చని అభిప్రాయపడింది.
కాగా, శుక్రవారం నరా నగరంలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై టెట్సూయో యమగామి (Tetsuyo Yamagami) అనే వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబేపై కాల్పులు జరిపిన యమగామి.. నరా నగరానికి చెందిన వాడే. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వయంగా అతడే తయారు చేసినట్లు తెలిసింది. యమగామి గతంలో జపాన్ సైన్యంలో పనిచేశాడు. నేవీకి చెందిన మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో 2005 వరకు నేవీలో పనిచేశాడని అక్కడి మీడియా వెల్లడించింది.
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి.. ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి
అసలు షింజో అబేను ఎందుకు చంపాడో పోలీసుల విచారణలో అతడు వివరించాడు యమగామి. షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదని.. కానీ అసంతృప్తితో రగిలిపోతున్నాని చెప్పాడు. అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని నేరాన్ని అంగీకరించాడు. అయితే టెట్సుయా యగగామి అసంతృప్తికి కారణాలు ఏంటి? అతడే చేశాడా? లేదంటే ఎవరైనా వెనకుండి నడిపించారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నిందితుడి ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్లు జపాన్ మీడియా కథనాలను ప్రసారం చేశాయి. మరి యమగామి చెప్పిన దాంట్లో నిజముందా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస పార్టీ.. షింజో అబే హత్యను అగ్నిపథ్ పథకానికి లింక్ చేయడం మాత్రం దుమారం రేగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mamata Banerjee, Shinzo Abe, Trinamool congress, West Bengal