• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • WEST BENGAL CM MAMATA BANERJEE SEEN SHAKING INJURED LEG VIDEO GOES VIRAL WAR OF WORD BETWEEN TMC AND BJP SK

Mamata Banerjee: కాళ్లు ఊపుతూ కూర్చున్న మమత.. మరి ఆ గాయం ఏమైనట్లు? వీడియో వైరల్

Mamata Banerjee: కాళ్లు ఊపుతూ కూర్చున్న మమత.. మరి ఆ గాయం ఏమైనట్లు? వీడియో వైరల్

మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికల తర్వాత.. మమతా బెనర్జీ వీల్ ఛైర్‌పై కూర్చొని కాళ్లు ఊపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు గాయమైన ఎడమ కాలిపై కుడి కాలు వేసుకొని ఆమె కనిపించారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి గాయాల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, కాలికి తీవ్రమైన గాయమైందని అప్పట్లో ఆమె ఆరోపించారు. దీని వెనక బీజేపీయే ఉందని విమర్శించారు. కానీ టీఎంసీ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఓటమి భయంతో సానుభూతి కోసమే మమత ఈ డ్రామాలు ఆడుతోందని ఎదురు దాడికి దిగింది. ఐతే ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన ఈసీ.. మమతపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసింది. కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే ఘటన జరిగిందని ఎన్నికల సంఘం పరిశీలకులు వెల్లడించారు. ఈసీ ప్రకటన తర్వాత ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మమత డ్రామాలు ఆడుతోందని కమలం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది.

    పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికల తర్వాత.. మమతా బెనర్జీ వీల్ ఛైర్‌పై కూర్చొని కాళ్లు ఊపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు గాయమైన ఎడమ కాలిపై కుడి కాలు వేసుకొని ఆమె కనిపించారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్తలు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ''మేడం మీ యాక్టింగ్ అదుర్స్.. మీ అసలు రంగు బయటపడింది.'' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.



    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1 న జరిగాయి. మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరో దశ ఎన్నికలు ఏప్రిల్ 22న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం ఫలితాలతో పాటే మే 2న పశ్చిమ బెంగాల్ ఫలితాలను కూడా ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు