భారత దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ (BSF) పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్న తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇకపై పంజాబ్ (Punjab), పశ్చిమబెంగాల్ (west Bengal), అసోం (Assam) రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు (International borders) నుంచి 50 కి.మీ. వరకు లోపలకు వచ్చి బీఎస్ఎఫ్ దళాలు సోదాలు (search), జప్తులు చేయడం సహా అనుమానిత వ్యక్తులను అరెస్టు (Arrest) చేయవచ్చు. అయితే ఈ పరిధి గతంలో ఆయా రాష్ట్రాల్లో 15 కి.మీ వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్రం హోం శాఖ (Union home ministry) తీసుకున్న నిర్ణయం దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పశ్చిమ బెంగాల్ (west Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamatha Banerji) వ్యాఖ్యానించారు. కేంద్రం తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
బీఎస్ఎఫ్ (BSF) ముసుగులో రాష్ట్రాల అధికారాల్లో చొరబాటుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ (letter) పంపినట్లు మమతా తెలిపారు. కాగా, దీనిపై దేశ భద్రత బలోపేతానికి, డ్రగ్స్ (drugs) అక్రమ రవాణాను నిలువరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి.
పరిధిలో చేస్తే బాగుంటుంది..
మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందిస్తూ.. భారత దేశ సరిహద్దుల్లో (Indian borders) తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను (Good relations) కొనసాగిస్తున్నట్లు మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేయాల్సిన అవసరం లేదని బెంగాల్ సీఎం అన్నారు. శాంతి భద్రతలు (law and orders) రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలియజేశారు.
తమ పరిధిలోని అంశాలపైనే బీఎస్ఎఫ్ (BSF) దృష్టి సారించాలని, దీనికి తమ పూర్తి మద్ధతు ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్ (Bangladesh), నేపాల్ (Nepal), భూటాన్ (Bhutan) దేశాలతో సరిహద్దులు ఉన్నాయని ఆమె అన్నారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi)ని మమతా బెనర్జీ కోరారు.
ఇరు వర్గాలకు గొడవ..
కాగా, మమతా బెనర్జీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది ప్రస్పుటంగా కనిపించింది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింస సైతం చోటుచేసుకుంది. దీనిపై ఆయా రాజకీయ పక్షాలు ఒకరిమీద ఒకరు ఆరోపణలు సైతం చేసుకున్నాయి. ఇదే కోవలో పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్ పరిధిని పెంచారని తృణమూల్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, Mamata Banerjee, Union government, Union Home Ministry, West Bengal