హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bengal by-election: భవానీపురం నుంచి మమతా బెనర్జీ పోటీ..

Bengal by-election: భవానీపురం నుంచి మమతా బెనర్జీ పోటీ..

మమతా బెనర్జీ (File)

మమతా బెనర్జీ (File)

Bengal by-election: ముందుగా అనుకున్నట్లుగానే భవానీపురంనే ఎంచుకున్నారు మమతా బెనర్జీ. ఇక అక్కడ రసవత్తర పోరు లేనట్లే!. పూర్తి వివరాలు ఇవీ.

  West Bengal by-election: పశ్చిమ బెంగాల్‌లో... భవానీపురం, సంషేర్ గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు (by election) జరగనున్నాయి. అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India (ECI)) ప్రకటన జారీ చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు సాధించి అద్భుత విజయాన్ని అందుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)... తాను పోటీ చేసిన స్థానంలో మాత్రం ఓడిపోయారు. దాంతో 6 నెలల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆమె భవానీపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.

  మమతా బెనర్జీ సీఎం సీటులో కొనసాగాలంటే... ఆమె తప్పనిసరిగా ఉప ఎన్నికలో గెలవాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఈజీగా గెలుపు సాధించగల భవానీపురంని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ స్థానం మే 21 నుంచి ఖాళీగా ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహించే తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ తన సీటుకు రాజీనామా చేశారు.

  కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్

  2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ... హోరాహోరీ పోటీ ఉండే నందిగ్రామ్ స్థానానికి పోటీచేశారు. ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా సువేందు అధికారి (suvendu adhikari) ఉన్నా మమత కావాలనే పట్టుదలతో అక్కడ బరిలో దిగారు. ఐతే... సువేందు అధికారికి నందిగ్రామ్‌పై క్షేత్రస్తాయిలో పట్టు ఉంది. అందువల్ల మమతా బెనర్జీకి విజయం దక్కేలా కనిపించి... చివరకు నిరాశ పరిచింది. జస్ట్ 1700 ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయారు. భవానీపురం మాత్రం మమతకు పెట్టని కోట. అక్కడ ఆమె ఇదివరకు 2సార్లు పోటీ చేసి గెలిచారు.

  2011లో మమతా బెనర్జీ బెంగాల్‌కి తొలిసారిగీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఆమె కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఆమె ఎంపీగా చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.

  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం... ఎవరైనా మంత్రిగా ఉంటూ... ఎన్నికల్లో ఓడిపోతే... నెక్ట్స్ 6 నెలల్లో గెలవాలి. లేదంటే పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. బెంగాల్‌తోపాటూ.. ఒడిశా (Odisha)లోని పిప్లీ (Pipli) అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30నే ఎన్నిక జరగనుంది.

  ఇది కూడా చదవండి: Zodiac signs: అతి ప్రేమ చూపించే రాశులు.. తట్టుకోలేరు!

  మొత్తానికీ ఈ ఉప ఎన్నిక ప్రకటనతో మళ్లీ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కనున్నాయి. భవానీపురంలో మమత గెలుపుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీలు... ముఖ్యంగా బీజేపీ... మమతను ఈజీగా గట్టెక్కనిస్తుందా... లేక అక్కడ కూడా బలమైన ప్రత్యర్థిని దింపి... దీదీకి సవాల్ విసురుతుందా అన్నది ఈ వారంలో తెలిసే ఛాన్స్ ఉంది. అచ్చొచ్చిన స్థానం కాబట్టి... ఏ టెన్షనూ లేకుండా గట్టెక్కవచ్చనే ఉద్దేశంతో ఉన్న దీదీ... మరోసారి బలంగా ప్రచారం చేస్తారని మాత్రం తెలుస్తోంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Mamata Banerjee, West Bengal

  ఉత్తమ కథలు