హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. సీఎస్ ఆలపన్ పదవీ విరమణ.. కీలక పదవి కట్టబెట్టిన మమత

బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. సీఎస్ ఆలపన్ పదవీ విరమణ.. కీలక పదవి కట్టబెట్టిన మమత

మమతా బెనర్జీ (File)

మమతా బెనర్జీ (File)

కేంద్ర స‌ర్వీసుల‌కు తిరిగి రావడానికి నిరాకరించినందుకు ఆలపన్ బంధోపాధ్యాయకు కేంద్రం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత ఆల‌ప‌న్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విమరణ చేశారు.

  పశ్చిమ బెంగాల్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ సీఎస్ ఆల‌ప‌న్ బంధోపాధ్యాయ‌ను కేంద్ర స‌ర్వీసుల‌కు పంపాల‌ని కేంద్రం పశ్చిమ బెంగాల్‌ను ఆదేశించింది. అయితే కేంద్రానికి మ‌మ‌తా బెన‌ర్జీ ఘాటుగానే స‌మాధాన‌మిచ్చారు. సోమ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆలపన్‌ను రాష్ట్ర ప్రధాన స‌ల‌హాదారుగా నియ‌మించారు. అంతకుముందు కేంద్ర స‌ర్వీసుల‌కు తిరిగి రావడానికి నిరాకరించినందుకు ఆలపన్ బంధోపాధ్యాయకు కేంద్రం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేంద్రం ఈ చర్య తీసుకున్న కొద్ది నిమిషాల తర్వాత ఆల‌ప‌న్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవీ విమరణ చేశారు.

  ఆ వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియ‌మించారు సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే ద్వివేది నియమితులయ్యారు. హోం శాఖ కార్యదర్శిగా బీపీ గోపాలిక‌ను నియ‌మించారు. యాస్ తుఫానుపై మోదీ జ‌రిపిన స‌మీక్షా స‌మావేశానికి మ‌మ‌తా బెన‌ర్జీ హాజ‌రుకాక‌పోవడాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్రం.. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆలప‌న్ బంధోపాధ్యాయను ఢిల్లీలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

  సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌లోపే ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే ఆల‌ప‌న్ బంధోపాధ్యాయ మే 31నే ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్నార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ మీడియాకు చెప్పారు. ఆ వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియ‌మించారు. మొదటి నుంచి కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే పంథాను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Mamata Banerjee, West Bengal

  ఉత్తమ కథలు