కోల్‌కతాలో సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్... సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్న సీబీఐ... బెంగాల్‌లో తృణమూల్ ఆందోళనలు

Modi vs Mamata : పశ్చిమబెంగాల్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఏకంగా సీబీఐ అధికారులనే కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో తేల్చుకోబోతోంది సీబీఐ.

news18-telugu
Updated: February 4, 2019, 7:28 AM IST
కోల్‌కతాలో సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్... సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్న సీబీఐ... బెంగాల్‌లో తృణమూల్ ఆందోళనలు
ధర్నాలో మమతా బెనర్జీ
  • Share this:
సీబీఐ అధికారులు ఎంటర్ అవ్వగానే... హడలిపోయే రోజులు పోయాయి. రివర్సులో సీబీఐ అధికారులకే షాకిచ్చే రోజులివి. బెంగాల్‌లో అదే జరుగుతోంది. శారదా స్కాంలో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించడానికి ఢిల్లీ నుంచీ సీబీఐ అధికారులు... ఆయన ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించడంతో రాజుకున్న అగ్గి... మరింత భగ్గుమంటోంది. సీబీఐ అధికారులను అడ్డుకున్న కోల్‌కతా పోలీసులు... వాళ్లను జీపులో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కి తీసుకుపోవడంతో వివాదం రచ్చకెక్కింది. సీబీఐపై అగ్గిమీద గుగ్గిలమైన సీఎం మమతా బెనర్జీ... వెంటనే రాజీవ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి మద్దతుగా నిలిచారు. పోలీస్ శాఖతో పాటు అన్ని వ్యవస్థల్నీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. అక్కడితో ఆగలేదు. రాత్రికి రాత్రి ఆమె... ఎస్ప్లనేడ్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా తాను కూర్చున్న చోటే జరుగుతాయని తేల్చిచెప్పారు.

mamata banerjee, mamata banerjee news, mamata banerjee dharna, chief minister mamata banerjee, mamata banerjee live, mamata banerjee speech, mamta banerjee latest, mamta banerjee cbi, mamta banerjee dharna against cbi raid, mamata banerjee sit on strike against cbi raid, మమతా బెనర్జీ, సీబీఐ
ధర్నాలో మమతా బెనర్జీ


శారద స్కాంలో యజమానుల్ని అరెస్టు చేయించామన్న మమతా బెనర్జీ... దర్యాప్తు కోసం సిట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న ఆమె... అవసరమైతే సీబీఐ అధికారుల్ని అరెస్టు చేస్తామని ప్రకటించారు. అరెస్టు వారెంట్ లేకుండా సీబీఐ అధికారులు... పోలీస్ కమిషనర్ ఇంటికి ఎందుకువచ్చారని ప్రశ్నించారు దీదీ.ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఇవాళ స్పందిస్తానని కమిషనర్‌ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇవాళ బెంగాల్‌ అంతటా ఆందోళనలు నిర్వహించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సిద్ధమైంది. మమతా బెనర్జీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు.శారదా, రోజ్‌వ్యాలీ పోంజీ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించిన సీపీని కొన్ని పత్రాల నిమిత్తం ప్రశ్నించాల్సి ఉండగా ఆయన పారిపోయారని సీబీఐ శనివారం ఆరోపించింది. ఆదివారం సీపీ ఇంటికి వెళ్లడంతో రచ్చ రేగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, సోమవారం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి పరిస్థితిని వివరిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

mamata banerjee, mamata banerjee news, mamata banerjee dharna, chief minister mamata banerjee, mamata banerjee live, mamata banerjee speech, mamta banerjee latest, mamta banerjee cbi, mamta banerjee dharna against cbi raid, mamata banerjee sit on strike against cbi raid, మమతా బెనర్జీ, సీబీఐ
కోల్‌కతా పోలీస్ కమిషనర్ కార్యాలయం


శారదా స్కాం వివరాలు : బెంగాల్‌లో 200 మంది ప్రైవేటు వ్యక్తులు శారదా గ్రూప్‌ కంపెనీని స్థాపించారు. 2013లో MLM స్కీం కింద 10 లక్షల మంది నుంచీ రూ.10,000 కోట్లు తీసుకున్నారు. కాశ్మీరు పారిపోయిన కంపెనీ ఛైర్మన్‌, ఎండీ సుదీప్‌సేన్‌తో పాటు కంపెనీ ప్రముఖులను 2013లోనే అరెస్టు చేశారు. కొంతమంది తృణమూల్‌ ఎంపీలకూ ఇందులో పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో సుదీప్‌సేన్‌ ఆరోపించారు. సెబీ, ఆర్‌బీఐ, ఐదీ, కేంద్ర ఆర్థికశాఖ, ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి మతంగ్‌సింగ్‌ భార్య మనోరంజన్‌సింగ్‌ తరఫున వాదించిన ప్రముఖ లాయర్ నళిని చిదంబరం చిక్కుల్లో పడ్డారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం భార్య అయిన ఆమె రూ.1.26 కోట్లు ‘శారదా’ మనీని ఫీజుగా తీసుకున్నారని ఈడీ కేసు పెట్టింది. ఆ కేసు కొనసాగుతోంది.

రోజ్‌వ్యాలీ స్కాం వివరాలు : ఇది కూడా MLM టైపే. ప్లాట్లు కొనేవారూ, టూరిజం స్పాట్లకు వెళ్లే వాళ్లను టార్గెట్ చేసుకున్నారు. కమిషన్‌ పద్ధతిలో గొలుసుకట్టుగా చందాదారులను చేర్పించారు. టైం పూర్తయ్యాక డబ్బును డిపాజిట్‌ చేసినవాళ్లకు 21 శాతం వడ్డీ ఇస్తామన్నారు. దాదాపు రూ.40,000 కోట్లను రోజ్‌వ్యాలీ రియల్‌ఎస్టేట్స్‌- కన్‌స్ట్రక్షన్స్‌, రోజ్‌వ్యాలీ హోటల్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు ప్రజల నుంచి సేకరించాయి. 2013, 2014లో ‘సెబీ’ ఈ స్కీంలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించింది. డబ్బు మొత్తం అక్రమార్కులకు చేరింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన తపస్‌పాల్‌, సుదీప్‌ బందోపాధ్యాయ్‌, రోజ్‌వ్యాలీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం కుందును సీబీఐ అరెస్టు చేసింది. మరింత మందికి తృణమూల్ నేతలకు ఈ స్కీములతో సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.

 

Video : గోవిందుడి ఆలయంలోనే... గోవిందా.... గో...వింద...
First published: February 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు