Home /News /national /

WEST BENGAL CHIEF MINISTER MAMATA BANERJEE IRKS CONGRESS PRESIDENT SONIA GANDHI WITH HIS COMMENTS AK

Sonia Gandhi: సోనియాగాంధీకి ఊహించని షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఆ మాటలకు అర్థమేంటి ?

సోనియా, రాహుల్‌తో మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

సోనియా, రాహుల్‌తో మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం పలు పార్టీలకు సన్నగల్లింది. అందుకే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి.

    ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటికీ నాయకత్వం వహించాల్సింది మాత్రం కచ్చితంగా తామే అని.. ఈ విషయంలో మరో పార్టీకి అలాంటి అవకాశం ఉండదనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తుంటుంది. అయితే కాంగ్రెస్‌కు ఉన్న ఈ ఒక్క ఆశ, ధీమాను కూడా దూరం చేయడానికి బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. తాజాగా ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.. ఆ రకంగానే ఉన్నాయనే చర్చ జాతీయ రాజకీయాల్లో మొదలైంది.

    “ఏమిటి యుపిఎ? ఇక యూపీఏ లేదు. కొత్త బ్లాక్‌ను ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై మేము కూర్చుని నిర్ణయం తీసుకుంటాము,” అని మమతా బెనర్జీ బుధవారం మధ్యాహ్నం శరద్ పవార్‌తో భేటీ అనంతరం వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని.. అసలు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూడా మనుగడలో లేదని అన్నట్టుగా మమతా బెనర్జీ కామెంట్ చేయడం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇబ్బంది కలిగించే పరిణామమే. అసోం, గోవా, మేఘాలయలకు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది.

    తాజాగా సాధారణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల కనీస ఉమ్మడి కార్యక్రమం కోసం ఒక ఎజెండా సెట్ చేయబడుతుందని... మా ప్రత్యర్థులు ప్రతివ్యూహాలు రూపొందించకూడదని తాను కోరుకోవడం లేదు కాబట్టి ఆ వివరాలను వెల్లడించాలనుకోవడం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 19 రాజకీయ పార్టీలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్లమెంటరీ స్థానాల సంఖ్య పరంగా కాస్త పెద్దది.

    KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

    ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    అయితే భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం పలు పార్టీలకు సన్నగల్లింది. అందుకే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఆ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ ముందువరుసలో ఉందనే విషయం అర్థమవుతోంది. అయితే మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు.. కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారతాయేమో అనే చర్చ మాత్రం జాతీయ రాజకీయాల్లో మొదలైంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Assembly Election 2022, Mamata Banarjee, Sonia Gandhi

    తదుపరి వార్తలు