హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. గవర్నర్‌కు బిగ్ షాక్

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. గవర్నర్‌కు బిగ్ షాక్

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

West Bengal: బెంగాల్ గవర్నర్ ట్వీట్లతో తాను కలవరపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల తాను అందరికీ క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు.

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధంఖర్‌ ట్విట్టర్‌ అకౌంట్ బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అసలు గవర్నర్ జగ్‌దీప్ ధంఖర్‌ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయడానికి గల కారణాలు కూడా ఆమె వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జగ్‌దీప్ ధంఖర్‌ జోక్యం చేసుకుంటున్నారని.. ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అందరినీ తరచుగా బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ట్విట్టర్‌లో బ్లాక్ చేయవలసి వచ్చిందని మమతా బెనర్జీ అన్నారు. ప్రతి రోజూ ఆయన ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ ట్వీట్లతో తాను కలవరపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల తాను అందరికీ క్షమాపణలు చెబుతున్నానని మమతా బెనర్జీ అన్నారు.

  గవర్నర్ ధన్‌కర్ రాజ్యాంగ విరుద్ధమైన, అనైతికమైన విషయాలు మాట్లాడతాడని ఆరోపించారు. ఆయన సలహాలు ఇవ్వడని.. ఎన్నికైన ప్రభుత్వాన్ని బంధిత కార్మికులలా చూస్తాడని విమర్శించారు. అందుకే ఆయనను నిరోధించామని అన్నారు. బెంగాల్ గవర్నర్‌గా ధన్‌ఖర్‌ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ అన్నారు.

  గత ఏడాది కాలంగా గవర్నర్ ధన్‌కర్ విషయంలో ఓపికగా కష్టపడుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. ఆయన అనేక ఫైళ్లను క్లియర్ చేయలేదని.. ప్రతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నాడని ఆరోపించారు. విధానపరమైన నిర్ణయాలపై ఆయన ఎలా మాట్లాడతారని సీఎం మమతా బెనర్జీ మీడియాతో అన్నారు.

  Akhilesh Yadav: తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..

  Assembly Polls: పెరిగిన Covid మరణాలు.. సభలు, రోడ్‌షోలపై నిషేధం పొడిగింపు -EC నూతన మార్గదర్శకాలివే..

  పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ మధ్య వివాదాలు తలెత్తడం కొత్తేమీ కాదు. కొంతకాలంగా నుంచి వీరి మధ్య చాలా అంశాల్లో వివాదాలు వస్తూనే ఉన్నారు. ఒకదశలో గవర్నర్‌ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంది మమతా సర్కార్. మమతా బెనర్జీ గతేడాది తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వీరిద్దరి మధ్య ఉన్న ఈ వివాదాలు, విభేదాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. తాజాగా మమతా బెనర్జీ ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఈ మొత్తం వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Mamata Banerjee, West Bengal

  ఉత్తమ కథలు