WEST BENGAL ASSEMBLY PASSED RESOLUTION FOR FORMATION OF LEGISLATIVE COUNCIL AK
Mamata Banerjee: జగన్ నిర్ణయానికి భిన్నంగా మమతా బెనర్జీ.. అసలేం జరిగిందంటే..
మమత బెనర్జీ (పైల్ ఫోటో)
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. అక్టోబరులోగా మమతా బెనర్జీ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే శాసన సభ మంగళవారం తీర్మానం చేసింది. శాసనసభకు హాజరైన 265 మంది ఎమ్మెల్యేల్లో 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ తీర్మానంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న మమత బెనర్జీ ప్రస్తుతం శాసనసభ సభ్యురాలు కాదు. ఆమె ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది.
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. అక్టోబరులోగా మమతా బెనర్జీ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన మమతా బెనర్జీ.. శాసన మండలి ఉంటే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి ఏర్పాటుకు శాసన సభ తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించనుంది.
1969లో రద్దయిన శాసన మండలిని పునరుద్ధరిస్తామని టీఎంసీ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ శాసన సభ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించవలసి ఉంటుంది. కేంద్ర కేబినెట్ సమ్మతి ఉంటేనే శాసన మండలిని ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. మరోవైపు పదవీ గండాన్ని తప్పించుకోవడానికే శాసన మండలి పునరుద్ధరణకు నిర్ణయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంశం పట్ల కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ.. కేంద్రం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.