Home /News /national /

West Bengal Election Results: ఆ ఒక్క మాటే బెంగాల్లో టీఎంసీ విజయానికి.. బీజేపీ ఓటమికి బాటలు వేసిందా?

West Bengal Election Results: ఆ ఒక్క మాటే బెంగాల్లో టీఎంసీ విజయానికి.. బీజేపీ ఓటమికి బాటలు వేసిందా?

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)

West Bengal Results Latest News: బెంగాల్లో టీఎంసీ గెలుపు, బీజేపీ ఓటమికి కారణాలపై పోస్టుమార్టం చేస్తే చాలా అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, అందులో ఈ లోకల్ - నాన్ లోకల్ అనేది మాత్రం అత్యంత ఎక్కువ ప్రభావం చూపించదనేది మాత్రం కాదనలేని వాస్తవం.

ఇంకా చదవండి ...
  West Bengal Assemlby Elections Resutls Latest News: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడోసారి కూడా విజయకేతనం ఎగరవేసింది. బెంగాల్లో జరిగిన ఎనిమిది దశల ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన కౌంటింగ్‌లో టీఎంసీ పార్టీ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మీద ఘనవిజయాన్ని నమోదు చేసింది. మోదీ వర్సెస్ దీదీగా జరిగిన ఈ పోరులో ‘బెంగాల్ ఆడబిడ్డ’ పైచేయి సాధించారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న 294 నియోజకవర్గాలకు గాను 292 చోట్ల ఎన్నికలు జరిగాయి. అందులో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే 200 సీట్లు దాటింది. బీజేపీ 80 సీట్ల వద్దే ఆగిపోయింది. బీజేపీకి 100 సీట్లు కూడా దాటవంటూ గతంలో టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టే ఆ పార్టీ సెంచరీ కొట్టకుండానే బోల్తా పడింది.

  చరిత్రలో ఎన్నడూ లేనంతగా బెంగాల్లో ఈసారి ఎనిమిదిదశల్లో పోలింగ్ జరిగింది. 2016లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి మరో విడుత పెరిగింది. ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించడం, తృణమూల్ కాంగ్రెస్ కు పట్టున్న జిల్లాల్లో సగం ఒక దశలో ఎన్నికలు నిర్వహించి, మరో సగం నియోజకవర్గాలను మరో దశలోకి చేర్చడం లాంటి చర్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.

  టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఓట్వీట్ చేశారు. అందులో ఆయన చెప్పిందేంటంటే.. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, సీబీఐ, ఈడీ, ఈసీ, మోదీకి అనుకూలంగా ఉండే మీడియా, టీఎంసీ వెన్నుపోటుదారులు, వారి డబ్బుల కంటే దీదీ, అభిషేక్ బెనర్జీ, తృణమూల్ కార్యకర్తలు, బెంగాల్ గొప్పది. ఇలాగే కోవిడ్ మీద కూడా విజయం సాధిస్తాం’  డెరెక్ చెప్పినట్టు ఓ వైపు కేంద్రం మొత్తం ఉంది. మరోవైపు మమతా బెనర్జీ ఉన్నారు. అయితే, అర్థబలం, అంగబలం ఉన్న బీజేపీని మమతా బెనర్జీ మట్టికరిపించారంటే దానికి కారణం మాత్రం ఒకటే నినాదం. అదే నాన్ లోకల్. ఆ నినాదం కూడా బీజేపీ నుంచే తీసుకున్నారు మమతా బెనర్జీ. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మీద మమతా పోటీ చేయడంతో స్పందించిన సువేందు.. దీదీని నాన్ లోకల్ అంటూ అభివర్ణించారు. తాను నందిగ్రామ్‌కు లోకల్ అని కామెంట్ చేశారు. అదే పాయింట్‌ను మమతా అందుకున్నారు. మొత్తం రాష్ట్రానికి అప్లై చేశారు.

  ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ వచ్చి బెంగాల్ సొంత బిడ్డ అయిన మమతా బెనర్జీ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పించగలిగారు. దానికి తగినట్టు ఆమె మీద దాడి జరిగిందనే ప్రచారం చక్రాల కుర్చీలోనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా కొంత నాటకీయత కనిపించినా.. లోకల్ - నాన్ లోకల్ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే, రెండేళ్ల క్రితం లోక్ ‌సభ ఎన్నికల్లో 18 ఎంపీ సీట్లు గెలిచిన ఇప్పుడు బోర్లా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ట్రెండ్ కంటిన్యూ అయితే బీజేపీకి కనీసం 125 సీట్లు రావాలి. కానీ, 80 దగ్గర్లోనే ఆగిపోయింది.

  బెంగాల్లో టీఎంసీ గెలుపు, బీజేపీ ఓటమికి కారణాలపై పోస్టుమార్టం చేస్తే చాలా అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, అందులో ఈ లోకల్ - నాన్ లోకల్ అనేది మాత్రం అత్యంత ఎక్కువ ప్రభావం చూపించదనేది మాత్రం కాదనలేని వాస్తవం.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Amit Shah, Bjp, Mamata Banarjee, PM Narendra Modi, TMC, West Bengal Assembly Elections 2021

  తదుపరి వార్తలు