Home /News /national /

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో తుది దశ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో తుది దశ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Bengal Elections 2021: ఏప్రిల్ 10న నాలుగో దశ ఎన్నికల్లో కూచ్ బెహర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో ఎన్నికల సంఘం మరింత అప్రమత్తమయింది. మొత్తం 641 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి.

    పశ్చిమ బెంగాల్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఎనిమిదో దశలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 84 లక్షల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముర్షీదాబాద్, బిర్భుమ్‌లో 11 నియోజకవర్గాలు, మాల్దాలో 6, కోల్‌కతాలో 7 నియోజకవర్గాల పరిధిలో 11,860 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బిర్భుమ్ పశ్చిమ బెంగాల్‌లోనే సమస్యాత్మక ప్రాంతం కావడంతో అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఏప్రిల్ 10న నాలుగో దశ ఎన్నికల్లో కూచ్ బెహర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో ఎన్నికల సంఘం మరింత అప్రమత్తమయింది. మొత్తం 641 కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి.


    కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు లేకుంటే పోలింగ్ కేంద్రాలకు అనుమతించడం లేదు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

    కాగా, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి. ఎనిమిదో దశ ఎన్నికలు నేడు జరగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న బెంగాల్ న్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

    పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం 16,403 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో మరో 73 మంది మరణించారు. తాజా లెక్కలతో బెంగాల్‌లో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,76,345కి చేరింది. ఇప్పటి వరకు 11,802 మంది చనిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kolkata, West Bengal, West Bengal Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు