Weight Loss Tips : ఈ రోజుల్లో అధిక బరువు తగ్గడానికి అంటూ ఎన్నో ఉచిత సలహాలున్నాయి. కానీ వాటిలో 90 శాతం పనిచేయనివే. చాలా కంపెనీలు... లేనిపోని సలహాలు ఇస్తూ... బిజినెస్ చేసుకుంటూ ఉంటాయి. ఊహాజనిత అబద్ధాలు చెప్పి... తమ పిల్స్, టాబ్లెట్లను అమ్ముకుంటూ ఉంటాయి. కానీ సహజ పద్ధతుల్లో బరువు తగ్గడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓవైపు బరువు తగ్గుతూనే, మరోవైపు నీరసం రాకుండా... ఫిట్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాంటి అవకాశం ఇచ్చే ఆహార పదార్థాల్ని "వెయిట్ లాస్ ఫ్రెండ్లీ డైట్" అని పిలుస్తున్నారు. సహజంగా గ్రీన్ టీ, హెర్బల్ టీలు... అధిక బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఐతే... రోజూ వాటినే తాగాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు. అందువల్ల మీకు మంచి రుచికరమైన టీ ఒకటి సూచిస్తున్నారు డాక్టర్లు. అదే "యాపిల్-అల్లం టీ. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఇది చక్కటి ఫ్లేవర్ మాత్రమే కాదు... ఈ రుచికరమైన టీ తాగితే ఆ ఫీలింగే వేరు.
ఈ టీ తయారీకి పాలతో పనిలేదు. కానీ బరువు తగ్గించే రెండు పదార్థాలు ఇందులో ఉంటాయి. ఒకటి యాపిల్. ఇందులో కేలరీలు చాలా తక్కువ, ఫైబర్ ఎక్కువ. అందువల్ల ఇది బరువును తగ్గించడమే కాదు... ఆకలిని తగ్గించి... ఎక్కువ తినకుండా చేస్తుంది. యాపిల్ మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కూడా. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలు, విషాలను బయటకు పంపించేస్తుంది. అందువల్ల యాపిల్-అల్లం టీ చాలా మంచిది.
అల్లంలోని యాంటీఆక్సిడెంట్స్‌కి తోడు... షోగాల్స్, జింజెరాల్స్ వంటివి కొవ్వును వేగంగా కరిగించేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. అంతేకాదు ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి అల్లం ఎంతో మేలు చేస్తుంది.
యాపిల్-అల్లం టీ ఎలా తయారుచెయ్యాలి? :
Step 1 – యాపిల్ తొక్క తీసి... చిన్న చిన్న ముక్కలుగా కొయ్యండి.
Step 2 - చిన్న అల్లం ముక్క, తొక్క తీసి, మిక్సీలో వెయ్యండి లేదా చితక్కొట్టండి.
Step 3 – మూడు కప్పుల నీటిలో యాపిల్ ముక్కలు, చితక్కొట్టిన అల్లం ముద్దను వేసి ఉడకబెట్టండి. 10 నుంచీ 12 నిమిషాలు అవి ఉడకాలి. ఆ సమయంలో... యాపిల్, అల్లం పూర్తిగా నీటిలో మునిగి ఉండేలా చెయ్యాలి.
Step 4 – స్టౌ ఆపేసి... ఆ నీటిని చల్లబడేలా కొన్ని నిమిషాలపాటూ పక్కన పెట్టాలి.
Step 5 – ఇప్పుడు ఆ నీటిని మిక్సీలో లేదా బ్లెండర్‌లో వేసి... స్మూత్ జ్యూస్‌లా అయ్యేవరకూ గ్రైండ్ చెయ్యాలి. ఇలా చేస్తే... యాపిల్-అల్లం టీ రెడీ.
కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ టీని తాగేయవచ్చు. ఉదయం ఏమీ తినకముందే, ఈ టీ తాగితే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. త్వరగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.