WEEKLY PAY POLICY THIS COMPANY WILL PAY EVERY WEEK PVN
Weekly Salary : కొత్త శాలరీ పాలసీ వచ్చేసింది..ఇకపై వారానికోసారి జీతం
వీక్లీ శాలరీ(ప్రతీకాత్మక చిత్రం)
Weekly pay policy : ఇక నుంచి జీతం కోసం ఉద్యోగులు నెల రోజుల పాటు వేచిచూడాల్సినవసరం లేదు. వారానికొకసారి జీతాలు ఉద్యోగుల చేతిక అందుతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ సహా చాలా దేశాల్లో సంస్థలు ఉద్యోగులకు వారం వారం జీతాల్ని చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఈ కల్చర్ మన దేశంలో కూడా మొదలైంది.
Weekly pay policy : కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వర్క్ కల్చర్‌తో పాటు ఉద్యోగుల చెల్లించే నెలవారీ జీతాల విధానం పూర్తిగా మారిపోతుంది. నెలకు ఒక సారి మాత్రమే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి వీక్లీ పే పాలసీని అనుసరిస్తున్నాయి కంపెనీలు. అంటే ఇక నుంచి జీతం కోసం ఉద్యోగులు నెల రోజుల పాటు వేచిచూడాల్సినవసరం లేదు. వారానికొకసారి జీతాలు ఉద్యోగుల చేతిక అందుతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్ సహా చాలా దేశాల్లో సంస్థలు ఉద్యోగులకు వారం వారం జీతాల్ని చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఈ కల్చర్ మన దేశంలో కూడా మొదలైంది. చాలా దేశాల్లో కంపెనీలు అమలు చేసే వీక్లీ పేమెంట్ విధానాన్ని భారత్‌లోకి తీసుకొచ్చింది దేశీయ బీ2బీ ఈ కామర్స్ సంస్థ "ఇండియా మార్ట్".
ఇక నుంచి ప్రతివారం ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని "ఇండియా మార్ట్" నిర్ణయించింది. ఇందుకోసం వీక్లీ పే పాలసీని ప్రవేశపెట్టింది. తమ ఉద్యోగులకు ఇకపై వారం వారం జీతం చెల్లిస్తామంటూ ఫేస్బుక్ ద్వారా ఇండియా మార్ట్ అధికారికంగా ప్రకటించింది. "ఉద్యోగులకు అనుగుణంగా ఉండే పని సంస్కృతిని నిర్మించడంతో పాటూ, వారి యోగక్షేమమే లక్ష్యంగా వారం వారం జీతాలు ఇచ్చేందుకు నిర్ణయించాం. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ సంస్థ మాదే"అని ఇండియా మార్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మారుతోన్న పరిస్థితులు, పెరుగుతోన్న ఆర్థిక భారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. కరోనా మహమ్మారితో ప్రజలకు ఆర్థిక అవసరం బాగా పెరిగిందని పేర్కొంది.
వారానికి ఒకసారి జీతాలు చెల్లించడం ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవని, తద్వారా వర్క్ ఉత్పాదకత పెరుగుతుందని ఇండియా మార్ట్ ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొంది. కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగి వీక్లీ పే పాలసీని స్వాగతించినట్టు ఇండియామార్ట్ సీఓఓ దినేష్ గులాటి తెలిపారు. చాలా ఏళ్ల క్రితం నుంచే కంపెనీ ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, ప్రతి వారం ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు తెలిపారు. కరోనా తర్వాత పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసిన తొలి కంపెనీగా ఇండియామార్ట్ నిలిచినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.