హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు అతి భారీ వర్షాలు

Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు అతి భారీ వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rain alert: వాతావరణశాఖ అంచనా ప్రకారం.. ఒడిశా, కోస్తాంధ్ర, తెలంగాణలో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

  దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. చాలా చోట్ల 5 రోజులుగా ఎడతెరిపి లేని వానలు జోరుగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. మహా నగరాలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. ఐతే మరిన్ని రోజులు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం అంచనావేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల వైపు అల్పపీడనం ఏర్పడడంతో పాటు అరేబియా సముద్రం పైనుంచి తేమతో కూడిన గాలులు నైరుతి దిశగా చురుగ్గా కదులుతున్నాయి. వీటికి రుతుపవనాలు తోడవడంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది.

  వాతావరణశాఖ అంచనా ప్రకారం.. ఒడిశా, కోస్తాంధ్ర, తెలంగాణలో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఇక గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలో ఘాట్ ప్రాంతాలు, ఈస్ట్ రాజస్థాన్, సెంట్రల్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో 4-5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. ఇక ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు రాజస్థాన్, యూపీలో రాగల 24 గంటల్లో పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Heavy Rains, Monsoon rains, Rain alert, South West Monsoon

  ఉత్తమ కథలు