హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Cyclone Tauktae: మరో ముప్పు.. దూసుకొస్తున్న తుఫాన్.. ఈ రాష్ట్రాలపై ప్రభావం

Cyclone Tauktae: మరో ముప్పు.. దూసుకొస్తున్న తుఫాన్.. ఈ రాష్ట్రాలపై ప్రభావం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తుఫాన్ ప్రభావంతో మే 14 నుంచి లక్షదీవులు సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, కర్నాటకలోని పలు చోట్ల కూడా భారీ వానలు పడతాయని తెలిపింది.

కరోనాతో తల్లడిల్లుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడబోతోందని భారత వాతావరశాఖ అంచనా వేసింది. మే 12న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. అది ముందుకు కదులుతూ మే 13 నాటికి వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తర-వాయవ్య దిశగా కదిలి మే 17 నాటికి తుఫాన్‌గా బలపడుతుందని పేర్కొంది. ఆ తుఫాన్‌కు తౌక్తే (Tauktae) నామకరణం చేశారు. మయన్మార్ దేశం ఈ పేరు సూచించింది. తౌక్తే అంటే మయన్మార్లో బల్లి అని అర్ధం. ఐతే ఈ తుఫాన్ ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందో ఇప్పుడే చెప్పలేమిన భారాత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ వాయవ్య దిశగా ముందుకు సాగుతూ మరింత బలపడవచ్చని వెల్లడించింది. గుజరాత్‌లోని కచ్, దక్షిణ పాకిస్తాన్ వైపు కదలవచ్చని అంచనా వేసింది.



అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం తుఫాన్‌గా బలపడితే.. ఈ సంవత్సరంలో ఇదే తొలి తుఫాన్ కానుంది. దీని ప్రభావంతో మే 14 నుంచి లక్షదీవులు సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడు, కేరళ, కర్నాటకలోని పలు చోట్ల కూడా భారీ వానలు పడతాయని తెలిపింది. తుఫాన్ నేపథ్యంలో మే 13 నుంచి 15 వరకు కేరళ, లక్షదీవులు ప్రాంతాలోని మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. మే 14 నుంచి నుంచి 15 వరకు కర్నాటక, మహారాష్ట్ర, గోవా తీరంలోని మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారంతా మే 12 అర్ధరాత్రి వరకు తీరానికి చేరుకోవలని అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: Arabian Sea, Rains, WEATHER, Weather report

ఉత్తమ కథలు