మాకు మరోసారి అధికారమిస్తే...2031 నాటికి దారిద్ర్యరేఖను మాయం చేస్తాం...

రానున్న 3 సంవత్సరాల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో ఇప్పటికే 15 శాతానికి పరిమితమవుతుందని, అలాగే 2031 నాటికి దారిద్ర్య రేఖ పూర్తిగా తొలగిపోతుందని అరుణ్ జైట్లీ తెలిపారు.

news18-telugu
Updated: April 15, 2019, 7:21 PM IST
మాకు మరోసారి అధికారమిస్తే...2031 నాటికి దారిద్ర్యరేఖను మాయం చేస్తాం...
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(File)
  • Share this:
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని, అయితే ఇదే వేగంతో వృద్ధి కొనసాగితే 2031 నాటికి దేశంలో పూర్తిగా అంతరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంచనా వేస్తున్నారు. దేశంలోని 130 కోట్ల జనాభాలో దాదాపు 21 శాతం మంది రోజుకు 150 రూపాయల కన్నా తక్కువ వేతనంతో జీవితం గడుపుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ 2011లో అంచనా వేసింది. అయితే తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల వల్ల దారిద్ర్యం తొలగిపోతోందని జైట్లీ అన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో ఇప్పటికే 15 శాతానికి పరిమితమవుతుందని, అలాగే 2031 నాటికి దారిద్ర్య రేఖ పూర్తిగా తొలగిపోతుందని అరుణ్ జైట్లీ తెలిపారు. తన ఫేస్‌బుక్ ‌పేజ్ లో అరుణ్ జైట్లీ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, అలాగే దేశంలో మధ్యతరగతి వర్గం కూడా విస్తరిస్తోందని, అయితే వీరందరికీ ఉద్యోగాల కల్పన పెద్ద సవాలుగా మారనుందని జైట్లీ తెలిపారు. అయితే గడిచిన 3 దశాబ్దాల ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశంలో ఉద్యోగాల కల్పన పెరిగిందని, జైట్లీ తెలిపారు. అలాగే దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై పెద్దగా చేపట్టనున్నామని, ఫలితంగా ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందని జైట్లీ అన్నారు. అలాగే భారత్ ఎదుట జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతన్న ఉగ్రవాద కార్యకలాపాలు సైతం ఒక పెద్ద సవాలుగా మారిందని జైట్లీ అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం పాకిస్థాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు మన్ననలు పొందినట్లు పేర్కొన్నారు.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు