• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • WE WILL RENAME TAJ MAHAL AS RAM MAHAL SAYS UP BJP MLA SURENDRA SINGH SK

Taj Mahal: తాజ్ మహల్‌ పేరు మార్పు.. కొత్త పేరు ఇదే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Taj Mahal: తాజ్ మహల్‌ పేరు మార్పు.. కొత్త పేరు ఇదే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తాజ్ మహల్

గతంలో తాజ్ మహల్ స్థానంలో శివాలయం ఉండేదని.. యోగి ఆదిత్యనాథ్ నేత‌ృత్వంలోని యూపీ ప్రభుత్వం, త్వరలోనే తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చనుందని ఆయన స్పష్టం చేశారు.

  • Share this:
    తాజ్ మహల్.. ! షాజహాన్, ముంతాజ్‌ల ప్రేమ మందిరం..! ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం..! ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది పర్యాటకులు తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ ప్రపంచ వింతను చూసి కొత్త అనుభూతిని పొందుతారు. ఐతే ఇలాంటి తాజ్‌మహల్‌పై మళ్లీ రాజకీయ వివాదం రాజుకుంది. తాజ్ మహల్ పేరు త్వరలో మారబోతోందని యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహల్ స్థానంలో శివాలయం ఉండేదని.. యోగి ఆదిత్యనాథ్ నేత‌ృత్వంలోని యూపీ ప్రభుత్వం, త్వరలోనే తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చనుందని ఆయన స్పష్టం చేశారు.

    బలియా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సురేంద్ర సింగ్. అంతేకాదు యూపీ సీఎం యోగిని శివాజీ వారసుడని ప్రశంసలు కురిపించారు. ''ఉత్తరప్రదేశ్ గడ్డపై శివాజి వారసుడు అడుగుపెట్టాడు. సమర్థ్ గురు రాందాస్ ఎలాగైతే శివాజిని ఇండియాకు ఇచ్చారో.. అలాగే గోరఖ్‌నాథ్ జీ కూడా యోగిని ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారు.'' అని కొనియాడారు.



    తాజ్ మహల్‌పై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తేజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందని వెల్లడించారు. కానీ మొగల్ చక్రవర్తులు శివాలయాన్ని కూల్చివేసి.. అక్కడ సమాధిని కట్టారని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దానికే తాజ్ మహల్ అని పేరు పెట్టారని చెప్పారు. అందుకే తాజ్ మహల్ పేరును మార్చాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
    Published by:Shiva Kumar Addula
    First published: