పెరిగిన విమాన టికెట్ రేట్లు.. కొత్త ధరలు ఎలా ఉంటాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

మెట్రో నగరాల్లో మూడో వంతు సర్వీసులను మాత్రమే నడుస్తాయని.. ఐతే నాన్ మెట్రో నగరాల్లో పూర్తి స్థాయిలో సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు.

 • Share this:
  మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కూడా కేంద్రం సవరించింది. దేశీయ విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా రూ.3000, గరిష్టంగా రూ.10వేలు ఉంటుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి తెలిపారు. గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. మెట్రో నగరాల్లో మూడో వంతు సర్వీసులను మాత్రమే నడుస్తాయని చెప్పారు. నాన్ మెట్రో నగరాల్లో పూర్తి స్థాయిలో సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ గరిష్ట ధర రూ.10వేలుగా ఉంటుందని తెలిపారు హర్దీప్ సింగ్ పూరి.

  ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. విమాన ప్రయాణ సమయం ఆధారంగా 7 కేటగిరీలుగా చార్జీలు ఉంటాయి. విమానాల్లో 40 శాతం సీట్లు బ్రాండ్ మిడ్ పాయింట్ కంటే తక్కువ ధరకు అమ్ముతారు. అంటే కనిష్ట ధర రూ. 3500, గరిష్ట ధర రూ.10,000 మిడ్ పాయింట్ ధర 6700. ధరలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు 24 వరకు టికెట్ ధరల విషయంలో ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

  ప్రయాణ సమయం ఆధారంగా కేటగిరీలు:

  1) 40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయం

  2) 40 - 60 నిమిషాల ప్రయాణ సమయం

  3) 60 - 90 నిమిషాల ప్రయాణ సమయం

  4) 90 - 120 నిమిషాల ప్రయాణ సమయం

  5) 120 - 150 నిమిషాల ప్రయాణ సమయం

  6) 150 - 180 నిమిషాల ప్రయాణ సమయం

  7) 180 - 210 నిమిషాల ప్రయాణ సమయం  Published by:Shiva Kumar Addula
  First published: