భారత్‌లో స్వేచ్ఛను అనుభవిస్తున్నాం... దలైలామా ఆసక్తికర కామెంట్స్

Dalai Lama : మనసులో ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేవారిలో బౌద్ధమత గురువు దలైలామా ఒకరు. టిబెట్‌కి స్వాతంత్ర్యం ఇవ్వకుండా చేస్తున్న చైనా వైఖరిని తప్పుపట్టే ఆయన... తనతో నెహ్రూ చెప్పిన ఓ విషయాన్ని గుర్తుచేశారు.

news18-telugu
Updated: October 14, 2019, 12:08 PM IST
భారత్‌లో స్వేచ్ఛను అనుభవిస్తున్నాం... దలైలామా ఆసక్తికర కామెంట్స్
దలైలామా(ఫైల్ ఫోటో)
  • Share this:
Dalai Lama : భారత్‌లో స్వేచ్ఛగా జీవిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నానని తెలిపారు బౌద్ధమతగురువు దలైలామా. చైనా బహిష్కరణతో టిబెట్ నుంచీ భారత్ వచ్చి... శరణార్థిగా ఇక్కడే ఉంటున్న ఆయన... 60 ఏళ్లుగా ఇండియాలో స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు. తాను శరణార్థిగా ఉన్నా... స్వేచ్ఛను చక్కగా అనుభవిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ఐతే... చైనా అధీనంలో ఉన్న టిబెట్‌కి స్వేచ్ఛను కల్పించే అంశంపై ఒకప్పుడు మాజీ ప్రధాని నెహ్రూతో ప్రస్తావించగా... ఐక్యరాజ్యసమితి అన్నీ చేయగలదని అనుకోవద్దని నెహ్రూ చెప్పిన మాటల్ని ఆయన గుర్తుచేసుకున్నారు. టిబెట్‌కు స్వాతంత్ర్యంపై చైనా పాలకులతోనే చర్చలు జరుపుకోవడం మంచిదని నెహ్రూ సూచించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు.

1974లో అప్పటివరకూ టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తాము... ఇక పోరాటాలు చేయకూడదని డిసైడైనట్లు దలైలామా వివరించారు. చైనాతో ఉంటూ... తమ సంస్కృతిని కాపాడుకునేందుకు కొన్ని హక్కులు తమకు ఇవ్వాలని కోరాలనుకున్నట్లు తెలిపారు. 2001 నుంచీ తాను రిటైరయ్యానన్న దలైలామా... ఎన్నికైన రాజకీయ నేతలు... బాధ్యతలు నిర్వహిస్తున్నారనీ... ప్రజాస్వామ్యం అంటే ఏంటో... చైనా పాలకులకు తాము నేర్పగలమని సెటైర్ వేశారు దలైలామా.

చైనా ఆధీనంలోని టిబెట్ ప్రభుత్వం అక్టోబర్ 6న ఓ తీర్మానం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం... తన వారసుడు ఎవరన్నది దలైలామానే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఏ దేశమూ జోక్యం చేసుకోదు.


Pics : ముద్గుగా... బొద్దుగా... ఆకట్టుకుంటున్న షాలిన్ జోయా ఇవి కూడా చదవండి :

తాగొచ్చిన భర్తను చావగొట్టిన భార్య... ఆ తర్వాత...

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు

ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీ

ఉత్తమ్‌‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్‌నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం
Published by: Krishna Kumar N
First published: October 14, 2019, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading