WATCH: వైమానికదళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు.. గాల్లో విన్యాసాలు

ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

news18-telugu
Updated: September 10, 2020, 12:50 PM IST
WATCH: వైమానికదళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు.. గాల్లో విన్యాసాలు
భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశ కార్యక్రమం
  • Share this:
భారత్‌ రక్షణ వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత వైమానిక దళంలోకి రఫేల్ యుద్ధ విమానాలు లాంఛనంగా ప్రవేశించాయి. 17 స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్‌లో ఈ ఫైటర్ జెట్స్ చేరాయి. హరియాణాలోని అంబాల ఎయిర్‌బేస్‌లో ఈ కార్యక్రమం జరుగింది. ముందుగా రఫేల్ విమానాన్ని ఆవిష్కరించి.. సర్వ ధర్మ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆకాశంలో రఫేల్, తేజస్ విమానాలు విన్యాసాలు చేశాయి. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదూరియా, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ ఆర్‌అండ్‌డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు ఫ్రెంచ్‌ ప్రతినిధి బృందానికి చెందిన ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌, ఎయిర్ జనరల్ ఎరిక్ ఆటోలెట్, ఫ్రెంచ్ వైమానిక దళం వైస్ చీఫ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


2016 సెప్టెంబరులో ఇండియా, ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం భారత ప్రభుత్వం రూ.58వేల కోట్లు ఖర్చు చేసింది. తొలి దశగా 5 విమానాలు భారత్ వైమానిక దళంలో ప్రవేశించాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 10, 2020, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading