దేశంలోనే అతిపెద్ద కరోనా ఆస్పత్రి వార్డులకు గల్వాన్ అమర జవాన్ల పేర్లు..

సైనికులల్లో మనో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు. బార్డర్‌లో తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.

news18-telugu
Updated: July 3, 2020, 10:07 PM IST
దేశంలోనే అతిపెద్ద కరోనా ఆస్పత్రి వార్డులకు గల్వాన్ అమర జవాన్ల పేర్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డీఆర్డీవో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి అయిన న్యూ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిలోని వార్డులకు గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల పేర్లను పెడతామని తెలిపింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ జవాన్లకు గుర్తుగా.. ఆస్పత్రి వార్డులకు వారి పేర్లను నామకరణం చేస్తామని వెల్లడించింది.

సర్దార్ వల్లభ భాయ్ ఆస్పత్రిలోని పలు వార్డులకు అమర జవాన్ల పేర్లను పెట్టాలని నిర్ణయించాం. జూన్ 15న గల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన జవాన్లకు గౌరవ సూచకంగా వారి పేర్లను నామకరణం చేస్తాం.
సంజీవ్ జోషి, డీఆర్డీవో ఛైర్మన్‌కు టెక్నాలజీ అడ్వైజర్


కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా 21 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు 43 మంది చైనీయులు కూడా చనిపోయారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. కానీ చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక సైనికులల్లో మనో స్థైర్యం నింపేందుకు ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు. బార్డర్‌లో తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ.. చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తాము శాంతిని కోరుకుంటామని.. అలాగని రెచ్చగొడితే ఊరకోబోమని స్పష్టం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 3, 2020, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading