ప్రధాని మోదీ (Pm Narendra Modi) సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat) తమ అడ్డా అని బీజేపీ మరోసారి నిరూపించింది. కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ (Bjp) ఘన విజయం దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. మోదీ మేనియా (Modi Maniya)తో గుజరాత్ (Gujarat) లో వార్ వన్ సైడ్ కాగా బీజేపీ (Bjp) ఏడోసారి సెన్సేషనల్ విక్టరీ సాధించబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కమలం పార్టీ అత్యధిక స్థానాల్లో కాషాయ జెండాను రెపరెపలాడిస్తుంది. మరి ఈ లెవల్ లో గుజరాత్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధాని మోదీ (Pm Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) లాంటి అగ్రనాయకుల రాష్ట్రం గుజరాత్ కావడం ఒక అంశం అయితే, బీజేపీ అమలు చేసిన వ్యూహాలు కమలం పార్టీకి సత్పలితాలు ఇచ్చాయి. మరి గుజరాత్ (Gujarat) లో బీజేపీకి కలిసొచ్చిన ఆ అంశాలేంటి? బీజేపీ అమలు చేసిన వ్యూహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అది బీజేపీకి ప్లస్ పాయింట్..
ఈసారి గుజరాత్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. అయితే అది ప్రచారానికే పరిమితం కాగా ఫలితాల్లో ఇటు కాంగ్రెస్, అటు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో హిందుత్వ భావనతో ప్రచారం చేసినప్పటికీ గుజరాత్ ప్రజలు కేజ్రీవాల్ ను తమ నేతగా భావించలేదని ఫలితాలను బట్టి అర్ధం అవుతుంది. అయితే కాంగ్రెస్ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారిందనే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించగా..కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలిచి గట్టి పోటీనిచ్చింది. కానీ ఈసారి కాంగ్రెస్ 20 స్థానాల్లో ముందజలో ఉండగా..బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.
కలిసొచ్చిన అంశాలేంటి?
గుజరాత్ లో మోదీ (Pm Narendra Modi), అమిత్ షా మేనియా పని చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి స్థానిక నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులు, అభివృద్ధిలో పరుగులు పెట్టడంతో ప్రజలు బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దీనితో ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేసి భూపేంద్ర పటేల్ కు సీఎం బాధ్యతలు అప్పగించింది.
ఇక ఆయా స్థానాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టడంలో సక్సెస్ అయింది. ఈమధ్య కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చిన 17 మందికి కూడా బీజేపీ టికెట్లు కేటాయించింది. అయితే సొంత పార్టీలో వున్న వారికి టికెట్లు రాకపోవడంతో వారు రెబల్స్ గా మారారు. అయితే అదే సమయంలో అమిత్ షా వారికి లాభదాయకమైన పదవుల వాగ్దానంతో శాంతించారు.
గుజరాత్ లో మోదీ (Pm Narendra Modi) మేనియా కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవడానికి దోహదం చేసింది. గత ఎన్నికలు ఇచ్చిన అనుభవంతో ఈసారి మోదీ (Pm Narendra Modi) కాస్త తీవ్రంగానే శ్రమించారు. ఎక్కువ సంఖ్యలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారం కోసం సమయాన్ని కేటాయించారు.
మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ అంశంలో కొంతమంది నాయకులు తీవ్రంగానే శ్రమించారు. ఈ అంశాలన్నీ కూడా బీజేపీ వైపు సానుకూల పవనాలు వీచేలా చేసింది. అయితే బీజేపీ అమలు చేసిన వ్యూహాలు ఎక్కువ స్థానాల్లో విజయానికి దోహదం చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Gujarat, Gujarat Assembly Elections 2022, Gujarath, Gujarath CM, Modi, Narendra modi, PM Narendra Modi