• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • WANT TO ENJOY WINTER TO THE FULLEST THESE 10 PLACES ARE THE BEST IN THE COUNTRY KRS

Winter Vacations: వింటర్​లో ఫుల్​గా ఎంజాయ్ చేయాలంటే.. దేశంలోని ఈ 10ప్లేస్​లు బెస్ట్  

Winter Vacations: వింటర్​లో ఫుల్​గా ఎంజాయ్ చేయాలంటే.. దేశంలోని ఈ 10ప్లేస్​లు బెస్ట్  

మనాలి

Winter Tourism: మంచుతో దట్టంగా కప్పుకున్న పర్వతాలు, రహదారులు, ఉల్లాసభరిత వాతావరణం, అందాలకు నెలవైన ప్రాంతాలకు శీతాకాలం(Winter)లో వెళితే ఫుల్​గా ఎంజాయ్ చేయవచ్చు. అలా వింటర్​ను ఆస్వాదించాలంటే భారత్​లోని ఈ ప్రాంతాలకు డిసెంబర్​, ఫిబ్రవరి మధ్య వెళ్లాల్సిందే.  

 • Share this:
  శీతాకాలం (వింటర్​) మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఎంజాయ్ చేయాలనుకుంటే వింటర్​ను​ మించిన కాలం మరొకటి ఉండదు. ఈ ఏడాది కరోనా వైరస్​ వల్ల్ ఎలాంటి విహార యాత్రలకు వెళ్లని వారికి ఇప్పుడు సమయం దొరికింది. వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడు బస్సులు, రైళ్లు నడుస్తున్నాయి. దేశీయంగా విమాన సర్వీసులు రన్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటే మంచు కురిసే ప్రాంతాలే ఉత్తమం. పర్వతాల వద్ద అందమైన పరిసరాలను చూస్తే ఛాయ్ తాగితే ఆ మజానే వేరు. ముంచు కురిసే వేళలో ఆటలాడుకుంటే ఆ ఎంజాయ్​మెంట్ విపరీతంగా ఉంటుంది. అందుకే డిసెంబర్​, జనవరిల్లో దేశంలో మంచు కురిసే 10 బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకోండి.

  మనాలీ, హిమాచల్ ప్రదేశ్

  హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఢిల్లీవాసులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. సీజన్​లో మొదట మంచు కురిసేది ఇక్కడే. మంచు దుప్పటి కప్పుకున్న ఇక్కడి పర్వతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

  ధనౌత్లి, ఉత్తరాఖండ్

  హిమాలయ పర్వతాల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం తెహ్రీ జిల్లాలో ఉంది. ధనౌత్లిలో మంచు దట్టంగా కురుస్తుంది. హిమం అంటే ఇష్టమున్నవారు ఇక్కడ ఫుల్​గా ఎంజాయ్ చేయవచ్చు. అడవులు సైతం ఎంతో మనోహరంగా ఉంటాయి. డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.

  అల్మోరా, ఉత్తరాఖండ్​

  ఉత్తరాఖండ్​లోని కంటోన్మెంట్ ప్రాంతం ఈ అల్మోరా. మంచు దుప్పటి కప్పుకున్న ఇక్కడి పర్వతాలు కనుల విందు చేస్తాయి. పైన్స్​, ఓక్స్ చెట్లు ఔరా అనిపిస్తాయి. అలాగే నందాదేవి, చిటై దేవాలయాలు ప్రముఖంగా ఉన్నాయి. 200 ఏళ్ల పురాతన లాలా బజార్ కూడా ఎంతో ఫేమస్​.

  గుల్మార్గ్, జమ్ముకశ్మీర్​

  Gulmarg in Baramulla district receives snowfall avr
  గుల్మార్గ్​


  డిసెంబర్​లో గుల్మార్గ్​ అత్యుద్భుతంగా ఉంటుంది. నైరుతి హిమాలయాల్లోని పిర్ పంజల్ రేంజ్​లో  ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ట్రావెల్ చేయడం కాస్త కష్టమే అయినా కాస్త ధైర్యం చేసే వారికి మాంచి కిక్ ఇస్తుంది. ఎందుకంటే గుల్మార్గ్​ లో గరిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 8 డిగ్రీల కనిష్టానికి కూడా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. దీంతో తీవ్రమైన చలి ఉంటుంది. కానీ ఇక్కడ కేబుల్ కార్ రైడ్ మాత్రం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది.

  లంబసింగి, ఆంధ్రప్రదేశ్

  Lambasingi, Beautiful Nature in Lambasingi, Lambasingi Attracts Tourists, Lambasingi Mesmerizing Beauty, Andhra Pradesh, visakhapatnam, లంబసింగి, లంబసింగి ప్రకృతి అందాలు, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
  లంబసింగి


  విశాఖపట్టణంలోని చింతపల్లిలోని కొండల్లో ఉన్న లంబసింగి ప్రకృతి అందాలకు నెలవు. ఆంధ్రప్రదేశ్​లోని ఈ చిన్నగ్రామం చాలా మందికి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్​గా మారింది. లైట్​గా కురిసే మంచు, పచ్చదనం ఎంతో ఆహ్లాదంగా, సుందరంగా ఉంటుంది. ఆర్గానిక్ కాఫీ పంటలు, జలపాతాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

  డార్జిలింగ్​ – పశ్చిమ బెంగాల్

  బెంగాలీ మనాలీగా డార్జిలింగ్ ఫేమస్​. ఈ రాష్ట్రంలోని దాదాపు అందరూ ఈ ప్రాంతానికి ఒక్కసారైనా వచ్చి ఉంటారు. ఇక్కడి గ్లేనరీ కేఫ్​లో కేక్​లకు ఎంజాయ్ చేసే ఉంటారు. హిమాలయ ఫుట్​హిట్ హిల్స్​లో ఉన్న ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం కూడా ఉంది. ఇక్కడి టాయ్ ట్రైన్​ రైడ్ టూరిస్టులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తాయి. 2018లో పదేళ్ల తర్వాత ఇక్కడ మంచు కురిసింది. సాధారణంగా ఇక్కడ ప్రతి ఏడాది మంచు కురవకున్నా.. బాగా చలిగా ఉంటుంది.

  ఔలీ, ఉత్తరాఖండ్

  నవంబర్, మార్చి మధ్యలో ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది. మంచులో ఆటలు ఆడాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్​. నందాదేవి, నర్ పర్వత్ వెనుక ఈ ప్రాంతం ఉంటుంది. ఓక్ ఫారెస్ట్ సైతం పర్యావరణ ప్రేమికులను కట్టి పడేస్తుంది. అలాగే ఇక్కడి యాపిల్ తోటలను తప్పక దర్శించాల్సిందే.

  తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

  అరుణాచల్​ప్రదేశ్​లోని తవాంగ్​ కు వెళ్లాలంటే డిసెంబర్ బెస్ట్ టైమ్​. ఎందుకంటే అప్పుడైతే మంచును ఎంజాయ్ చేయవచ్చు. ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం చాలా ఫేమస్​. ఇక్కడి పండ్ల ఉద్యాన వనాలు ఎంతో అందంగా ఉంటాయి.

  నైనిటాల్​, ఉత్తరాఖండ్

  చుట్టూ పర్వతాలు, సరస్సులు ఉండే నైనిటాల్ అంటే ప్రతి పర్యావరణ ప్రేమికులు ఇష్టపడతారు. ఇక ఉత్తరాది వారైతే టక్కున ఈ ప్రాంతం పేరు చెబుతారు. క్రిస్మస్​, న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. నైనిటాల్ జూ, నైనీ సరస్సులో బోట్ రైడింగ్ ఎంతో మధురమైన అనుభూతిని ఇస్తాయి. ఇక్కడికి వెళితే తాజా స్ట్రాబెర్రీలను టేస్ట్ చేయాల్సిందే.

  మన్సియారీ, ఉత్తరాఖండ్

  ఉత్తరాఖండ్​లోని మన్సియారీకు మినీ కశ్మీర్​గా పేరుంది. మంచులో దుప్పటి వేసుకున్న ఇక్కడి హిమాలయ పర్వతాలు, ప్రకృతి అందాలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ట్రెక్కింగ్​కు సైతం ఈ ప్రాంతం ఎంతో పాపులర్​.
  Published by:Krishna P
  First published: