Home /News /national /

WANT RAGHAV NOT ELECTRICITY WOMAN TWEETS HERES HOW AAP LEADER REACTED DETAILS HERE VB

Love Praposal: ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన యువతి.. దానికి ఆ ఎమ్మెల్యే ఏం సమాధానం ఇచ్చారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం(Image credit : shutterstock)

ప్రతీకాత్మక చిత్రం(Image credit : shutterstock)

Love Praposal: తన పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఓ నెటిజన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. దీనికి ఓ అమ్మాయి తనకు ఉచిత విద్యుత్ వద్దని.. ఆ ఎమ్మెల్యే కావాలని రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ కాస్త సదరు ఎమ్మెల్యే వరకు చేరింది. చివరకు ఆ ఎమ్మెల్యే ఏం సమాధానం ఇచ్చారంటే..

ఇంకా చదవండి ...
    రాజకీయాల్లో యువ నేతలకు అమ్మాయిల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. గ‌తంలో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌కు అమ్మాయిల నుంచి లెట‌ర్స్ వ‌చ్చేవ‌ని ఆయనే చాలా సార్లు చెప్పారు. తాజాగా ఢిల్లీలోని రాజీంద‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీ నేత 32 ఏండ్ల‌ రాఘ‌వ్ చ‌ద్ధాకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గత ఎన్నికల ప్రచారం సమయంలో కూడా అతడికి సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టారు. అయితే ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న వేళ రాఘ‌వ్‌కు అలాంటి అనుభ‌వం మరో సారి ఎదురైంది. పంజాబ్ ఎన్నిక‌ల్లో తన పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే పంజాబ్‌లోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించబడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

    దీనిని ఎన్నికల ప్రచారంలో గురుదీప్ అనే వ్యక్తి ప్రస్తావిస్తూ.. మళ్లి ఒక్కసారి ఆ హామీని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. దానికి కీర్తి ఠాకూర్ అనే మహిళ స్పందిస్తూ.. "నాకు రాఘవ్ కావాలి, విద్యుత్ కాదు" అని ట్వీట్ చేసి పరోక్షంగా ఆ ఎమ్మెల్యే కు ప్రపోజ్ చేసింది. ఈ ట్వీట్ కాస్త రాఘ‌వ్ దృష్టికి రావ‌డంతో ఆమె ట్వీట్‌కు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. తాను మ్యానిఫెస్టోలో లేన‌ని, ఫ్రీ క‌రెంట్ మాత్ర‌మే ఉంద‌ని చెబుతూ రాఘ‌వ్ ట్వీట్ చేశారు.





    కేజ్రీవాల్‌కు ఓటేస్తే 24 గంటలు ఉచిత క‌రెంట్ అందుతుంద‌ని.. దానికి తాను హామీ ఇస్తున్నాన‌ని చెప్పారు. కానీ త‌న విష‌యంలో ఈ క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేన‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న స్క్రీన్ షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేశారు. Kejriwal di guarantee అన్న హ్యాష్ ట్యాగ్‌తో ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రెఫ‌ర్ చేస్తూ దీనిని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Aravind Kejriwal, Delhi news, Love, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు