Home /News /national /

WANT ELECTRICITY SUBSIDY FROM OCTOBER 1 ASK FOR IT SAYS CM KEJRIWAL PVN

Electricity Subsidy: అదంతా మన ఇష్టం,మనం చూజ్ చేసుకోవచ్చు..విద్యుత్‌ రాయితీ పథకంపై కేజ్రీవాల్ వెనకడుగు!

ఢి్ల్లీ సీఎం కేజ్రీవాల్

ఢి్ల్లీ సీఎం కేజ్రీవాల్

Kejriwal On Electricity Subsidy :  దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఆప్‌ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తోన్న విషయం తెలిసిందే. అలాగే 201-400 యూనిట్ల వినియోగంపై నెలకు రూ.800 రాయితీ ఇస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. 2015 ఎన్నికల సందర్భంగా ఉచిత విద్యుత్‌, ఉచిత తాగు నీటి పథకాలపై అరవింద్‌ క్రేజీవాల్‌ హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్‌ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
Kejriwal On Electricity Subsidy :  దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఆప్‌ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ఇస్తోన్న విషయం తెలిసిందే. అలాగే 201-400 యూనిట్ల వినియోగంపై నెలకు రూ.800 రాయితీ ఇస్తోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. 2015 ఎన్నికల సందర్భంగా ఉచిత విద్యుత్‌, ఉచిత తాగు నీటి పథకాలపై అరవింద్‌ క్రేజీవాల్‌ హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్‌ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంజాబ్‌లోనూ దీన్ని అమలు చేస్తామని ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఆయన హామీయిచ్చారు. అయితే ఉచిత, సబ్సిడీ విద్యుత్‌పై ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్‌ 1 నుంచి విద్యుత్‌ రాయితీ ఐచ్ఛికమని,అడిగే వారికి మాత్రమే ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత వేధిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. "చౌక విద్యుత్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ఐచ్ఛికం. వినియోగదారుడు విద్యుత్ సబ్సిడీని కోరుకుంటేనే ఇక నుంచి ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్‌ను పొందుతాడు. సబ్సిడీ అవసరం లేదకునేవారు సాధారణ రేటుకే కరెంటు ఉపయోగించుకుంటామని ప్రభుత్వానికి తెలపాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 నుండి రాయితీతో కూడిన విద్యుత్‌ అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది"అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించే సామర్థ్యం ఉన్నవారు ఉచిత విద్యుత్‌ పథకంతోపాటు విద్యుత్‌ రాయితీని వదులుకోవాలని పరోక్షంగా సూచించారు. అయితే ఉచిత విద్యుత్‌, విద్యుత్‌పై రాయితీ పథకం అమలు కోసం 2022-23లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం రూ.3,340 కోట్ల నిధులు బడ్జెట్‌లో కేటాయించింది.

ALSO READ Loud Speakers : రాజ్ థాకరే వార్నింగ్..కీలక నిర్ణయం తీసుకున్న ముస్లిం మత పెద్దలు

ఇక వేసవి కాలం నేపథ్యంలో ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గి ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో రైళ్లతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభావం చూపింది. ఢిల్లీ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్స్‌లో బొగ్గు కొరత ఉందని, తగినంత బొగ్గును అందుబాటులో ఉంచాలని కోరారు. దీనిపై సింగ్ స్పందిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వివిధ ప్లాంట్ల వద్ద అందుబాటులో ఉన్న బొగ్గు గురించి వివరించారు.

మరోవైపు, ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం గురువారం స్టార్టప్ పాలసీని ఆమోదించింది. యువత వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా సహాయపడతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అనేక ఏజెన్సీలను నియమించుకుని, వివిధ రంగాల్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. స్టార్టప్‌ ను ప్రారంభించాలనుకునేవారు సహాయం కోసం ఈ కమిటీలను సంప్రదించవచ్చని కేజ్రీవాల్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Arvind Kejriwal, Delhi, ELectricity

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు