Home /News /national /

WAMMO HE IS NOT NORMAL HE IS READY TO LOOT CRORES WITH THE CMS PHOTO ALONE WHAT HAPPENED IN THE END UMG GH

Cyber Fraudsters: వామ్మో వీడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?

వాడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?

వాడు మామూలోడు కాదయ్యో.. ఏకంగా సీఎం ఫొటోతోనే కోట్లు కొల్లగొట్టడానికి రెడీ ! చివరికి ఏమైందంటే ?

ఒక సైబర్‌ నేరస్థుడు డబ్బులు కాజేయడానికి ఏకంగా కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఫొటోనే తన వాట్సాప్ (WhatsApp) ప్రొఫైల్‌ పిక్చర్‌గా వాడాడు. ఆపై డబ్బు కావాలని ఒక ఐపీఎస్‌ అధికారికి మెసేజ్‌లు పంపించాడు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) అమాయక ప్రజలను మోసం చేసి లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు. పోలీసులు(Police) వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సైబర్ మోసగాళ్ల వలలో పడి నిండా మోసపోతున్నారు. ఈ కేటుగాళ్లు తెలివితో రోజుకొక కొత్త తరహాలో మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఒక సైబర్‌ నేరస్థుడు డబ్బులు కాజేయడానికి ఏకంగా కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఫొటోనే తన వాట్సాప్ (WhatsApp) ప్రొఫైల్‌ పిక్చర్‌గా వాడాడు. ఆపై డబ్బు కావాలని ఒక ఐపీఎస్‌ అధికారికి మెసేజ్‌లు పంపించాడు. దీంతో అప్రమత్తమైన ఆ అధికారి సైబర్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో గుర్తుతెలియని ఈ మోసగాడిపై కొచ్చి సైబర్‌ పోలీసులు (Kochi cyber police) కేసు నమోదు చేశారు.

తాజాగా సైబర్ కేటుగాడు టార్గెట్ చేసిన ఐపీఎస్ అధికారి జె జయనాథ్ కొచ్చిలోని కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి జె జయనాథ్ తన ఫిర్యాదులో.. ఆగస్టు 3న పినరయి విజయన్ ప్రొఫైల్ పిక్చర్ ఉన్న 8099506915 నుంచి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని సైబర్ పోలీసులకు తెలిపారు. ఆ వ్యక్తి వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా డబ్బు కూడా డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ తరహా ఫేక్ వాట్సాప్ అకౌంట్స్ నుంచి ఇంకా ఎక్కువ మంది పోలీసు ఉన్నతాధికారులకు మోసపూరిత మెసేజ్‌లు వచ్చినట్లు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: Raksha Bandhan:రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !



సీఎం ఫోటో వాడిన గుర్తుతెలియని దుండగుడు వ్యక్తిగతంగా మోసం చేసేందుకు ప్రయత్నించినందుకు IPC సెక్షన్ 419, మోసం కోసం ఫోర్జరీ చేయాలని చూసినందుకు IPC సెక్షన్ 468, నకిలీ డాక్యుమెంట్ లేదా ఎలక్ట్రానిక్ రికార్డును అసలైనదిగా ఉపయోగించినందుకు ఐపీఎస్ సెక్షన్ 471, కమ్యూనికేషన్ డివైజ్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించి మోసానికి యత్నించినందుకు సెక్షన్ 66D, నిజాయితీ లేకుండా ఎలక్ట్రానిక్ సంతకం, పాస్‌వర్డ్ లేదా ప్రత్యేక గుర్తింపును వాడినందుకు IT చట్టం సెక్షన్ 66C కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. గత నెలలో నమోదైన మరొక కేసులో ఐపీఎస్ అధికారి సంజీబ్ పట్జోషి ఫొటోని ఉపయోగించి ఫేక్ వాట్సాప్ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. గత నెలలో కోజికోడ్‌ జిల్లా కలెక్టర్‌ నరసింహుగారి టీఎల్‌రెడ్డి ఫొటో, ఇతర వివరాలతో కూడా ఫేక్ వాట్సాప్‌ ఖాతాను క్రియేట్ చేశారు మోసగాళ్లు. మార్చిలో, రాష్ట్ర పోలీసు చీఫ్ అనిల్ కాంత్ ఫొటోతో ఫేస్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి కొల్లంలోని ఒక ఉపాధ్యాయురాలి నుంచి రూ.14 లక్షలను కాజేశారు.



ఈ రోజుల్లో ఎవరో ఒక అధికారి ఫొటోలను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం.. అమాయకులకు మెసేజ్ పంపి డబ్బులు కావాలని అడగడం సైబర్ కేటుగాళ్లకు ఒక అలవాటుగా మారిపోయింది. ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లోనూ ప్రముఖ వ్యక్తుల ఫొటోలు, వివరాలతో అమాయకులను క్రిమినల్స్‌ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం ఫొటోలనే వాడుతూ ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులను బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ వ్యక్తుల ఫొటో డీపీగా ఉండి వాటి నుంచి మెసేజ్‌లు వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీరిని నమ్మి ఎటువంటి డీటెయిల్స్ అందించకూడదని, డబ్బులు పంపకూడదు అని సూచిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Cyber criminals, Pinarayi Vijayan, Social Media, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు