కర్ణాటకలో 15 నియోజకవర్గాల్లో ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

కర్ణాటకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడి 15 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి.

news18-telugu
Updated: December 5, 2019, 8:07 AM IST
కర్ణాటకలో 15 నియోజకవర్గాల్లో ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడి 15 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో జేడీఎస్, కాంగ్రెస్ సర్కారు కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. రెండు స్థానాలు మినహా 15 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఉప ఎన్నికల సందర్భంగా బెంగళూరు పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. అతానీ, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగుతోంది. అటు.. 9వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>