డబుల్ డెక్కర్ రైలు ఆశావహులకు నిరాశ.. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం వాయిదా..

Uday Express: విశాఖ- విజయవాడ మధ్య ప్రారంభం కావాల్సిన డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. రేపు (ఈ నెల 26న) రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి దీన్ని ప్రారంభించాల్సి ఉంది.

news18-telugu
Updated: August 25, 2019, 9:05 AM IST
డబుల్ డెక్కర్ రైలు ఆశావహులకు నిరాశ.. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం వాయిదా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ- విజయవాడ మధ్య ప్రారంభం కావాల్సిన డబుల్‌ డెక్కర్‌ ఏసీ రైలు ప్రారంభోత్సవం వాయిదా పడింది. రేపు (ఈ నెల 26న) రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి దీన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మరణంతో దీన్ని వాయిదా వేశారు. కాగా, ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనున్న ఈ రైలు ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుతుంది. వారంలో 5 రోజులు (గురువారం, ఆదివారం తప్ప) మాత్రమే నడిచే ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్ల మాత్రమే ఆగుతుంది.

ఇదిలా ఉండగా, మొదటి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌‌ను గతేడాది జూన్‌ నుంచి కొయంబత్తూర్-బెంగళూరు మధ్య నడుపుతోంది భారతీయ రైల్వే. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. ఈ రైలులో మొత్తం 9 ఏసీ కోచ్‌లు, 2 పవర్ కార్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీ ఉంటుంది. అప్పర్ డెక్‌లో 50, లోయర్‌డెక్‌లో 48, చివర్లో 22 మంది కూర్చోవచ్చు. మూడు కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో ప్రతీ కోచ్‌లో 104 ప్రయాణికులు కూర్చోవచ్చు. 5 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉండదు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు