• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • VIZAG STEEL PLANT NET PROFIT RS 800 CRORE FOR LAST FOUR MONTHS NGS

Vizag steel plant: నాలుగు నెలల్లో విశాఖ ఉక్కు లాభం ఎంతో తెలుసా? కేంద్రం తప్పుడు లెక్కలు చెబుతోందా?

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫైల్)

విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అన్న మాట అబద్ధమా? ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? లాభాలు వస్తున్నాయా? స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో రికార్డులు క్రియేట్ చేస్తోందా? మరి కేంద్రం ఎందుకు ప్రైవేటీకరించాలి అనుకుంటోంది.

  • Share this:
    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మారుమోగుతోంది.. కేంద్రం తీరుకు నిరసగా రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. కేవలం విశాఖలోనే కాదు రాష్ట్ర వ్యాపత్తంగా విశాఖ ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతోంది. ఓ వైపు కార్మిక సంఘాలు నిరసనలతో ఆందోళనలు తెలియజేస్తుంటే.. మరోవైపు ఉక్కు కార్మికుల తరపున మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటు గంటా శ్రీనివాసరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం మెట్టు దిగడం లేదు. రోజు రోజుకూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో కేంద్రం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి..

    కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితులో అడ్డుకుని తీరుతామని చెబుతున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నా ప్రైవేటీకరణ దేనికి అని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చెప్పినదాని ప్రకారం నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మేస్తామని అంటోంది. మరి లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ఎలా విక్రయిస్తుంది అంటూ కార్మిక సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తిపరంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోనే ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ఉత్పత్తి, సేల్స్ చాలా వరకు పెరిగిగాయని.. ఆ లెక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా విస్తరిస్తున్న కష్ట సమయంలో.. సవాళ్లను ఎదుర్కొంటూనే గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ వచ్చిందని గుర్తు చేశారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్‌కు 1200 కోట్ల ఉత్పత్తి లాభాలు వచ్చాయని ఆయన వెల్లడించారు.

    దేశానికి ఆదాయం సమకూరుస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తామంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తామన్నారు. ఈ నెల 4న ఆర్కే బీచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీచ్ వాక్ ను నిర్వహిస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ పరి రక్షణ కోసం అందరం కలిసి పోరాడుతున్నామన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు చేయలేదు.. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం దారణమని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామన్న రాజశేఖర్.. గంగవరం ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌ను కూడా ఇవ్వాలని చూస్తే ఊరుకోబోమని కేంద్రాన్ని హెచ్చరించారు.
    Published by:Nagesh Paina
    First published: