ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విమానం... 10 నిమిషాలు లేటైతే... ప్రాణాలు గాల్లోనే...

లక్నో ఎయిర్‌పోర్ట్ దగ్గర్లోకి విమానం రాగానే... అందులో ఇంధనం అయిపోయిందన్న విషయం తెలుసుకున్న పైలట్... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే (ఎమర్జెన్సీ) కాల్ చేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 9:06 AM IST
ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విమానం... 10 నిమిషాలు లేటైతే... ప్రాణాలు గాల్లోనే...
విస్తారా ఎయిర్‌లైన్స్ (Image : Reuters)
  • Share this:
ముంబై నుంచీ ఢిల్లీకి... 153 మంది ప్రయాణికులతో బయల్దేరింది విస్తారా విమానం. ఐతే... విజిబులిటీ తక్కువగా ఉండటంతో... ఆ విమానాన్ని లక్నో తీసుకువెళ్లా్ల్సిందిగా ఆర్డరేశారు అధికారులు. సరేనన్న పైలట్... లక్నోవైపు నడిపాడు. తీరా లక్నో ఎయిర్‌పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి... విమానంలో ఫ్యూయల్ (ఇంధనం) అయిపోయిందన్న సంగతి గుర్తించాడు పైలట్. వెంటనే లక్నో ఎయిర్‌పోర్ట్ అధికారులకు మేడే కాల్ చేశాడు. ఎమర్జెన్సీ టైంలో చేసే ఇలాంటి కాల్స్‌ని మేడే కాల్స్ అంటున్నారు. ఈ కాల్ రాగానే... అలర్టైన ఎయిర్‌పోర్ట్ అధికారులు... వెంటనే విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు కల్పించారు. దాంతో వెంటనే విమానాన్ని అక్కడ ల్యాండ్ చేశారు. అది సేఫ్ ల్యాండ్ అయ్యాక అందులో మిగిలివున్నది 300 కేజీల ఫ్యూయల్ మాత్రమే. దానితో మరో 10 నిమిషాలు మాత్రమే విమానం ఎగిరేందుకు వీలవుతుంది. అంటే... పది నిమిషాల్లో విమానం ల్యాండ్ అవ్వకపోయివుంటే... అది కూలిపోయేదే.

నిజానికి ఆ ఎయిర్‌బస్ A-320 నియో విమానం... ముంబై నుంచీ ఢిల్లీకి వెళ్లేందుకు సరిపడా ఫ్యూయల్ ఉంది. మరో గంట అదనంగా తిరిగేందుకు కూడా ఇంధనం ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో విమానాన్ని వేరే ఎయిర్‌పోర్ట్‌కి తరలించాల్సివస్తే... ఈ ఎక్స్‌ట్రా ఫ్యూయల్‌ని ఉపయోగిస్తారు. ఐతే... ఈ విమానంలో మాత్రం ఎక్స్‌ట్రా ఫ్యూయల్ లేదు. ఢిల్లీ వెళ్లేందుకు సరిపడా మాత్రమే ఉంది. ఐతే... ఢిల్లీలో వాతావరణం సరిగా లేకపోవడంతో... దాన్ని లక్నోకి మళ్లించారు. ఐతే... విమానంలో సరిపడా ఇంధనం లేదన్న విషయాన్ని పైలట్ చెప్పకపోవడం ఇక్కడ సమస్యగా మారింది.

విమానం లక్నో చేరేందుకు బయలుదేరగా... సడెన్‌గా లక్నోలో వాతావరణం మారిపోయింది. వెంటనే విమానాన్ని కాన్పూర్ లేదా ప్రయాగ్‌రాజ్ వైపు మళ్లించాలని అనుకున్నారు. ఈ గందరగోళం కొనసాగుతున్న సమయంలో... లక్నోలో వాతావరణం తిరిగి సెట్టైంది. దాంతో విమానాన్ని లక్నోకి తీసుకురావాల్సిందిగా ఆర్డరేశారు. అప్పటికే... రకరకాల మార్గాల్లో తిరగడంతో విమానంలో ఉన్న ఇంధనం అయిపోయింది. ఈ విషయం ముందుగా పైలట్ చెప్పకపోవడం ప్రమాద సంకేతాలు పంపింది. విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు