విశాఖపట్నం (Visakhapatnam). భారతదేశం గర్వించదగ్గ నగరం. నేవీ అధికారులు 24 గంటలూ తీరంలో గస్తీ కాస్తూ కాపలాగా ఉంటున్నారు. కాగా, విశాఖ ఘనతను గుర్తిస్తూ భారత ప్రభుత్వం సముద్ర రక్షణ (Marine protection) లో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌక (warship))కు విశాఖపట్నం పేరు పెట్టింది. ఇందులో భాగంగానే భారత నేవీ అధికారులు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం (INS Visakhapatnam warship) పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు చైనా సైతం ఇండియాను కవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ విశాఖ పట్నం చేరడం శుభపరిణామం. ఈ ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక (INS Visakhapatnam warship) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ యుద్ధ నౌకలో మేజర్ స్వదేశీ ఆయుధాలు ఇన్‌స్టాల్ చేశారు.
2011లోనే ఒప్పందం..
2011 వ సంవత్సరం జనవరి 28న ఈ ప్రాజెక్ట్ (project) ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ (Director of navel design), ఇండియన్ నేవీకి చెందిన సంస్థలు షిప్ డిజైన్ల (designs)ని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ (MDL) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ (sea trials) పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌక (ship)ను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం (Indian navel) సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ (Surat) పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. ఆయుధాలు ,సెన్సార్ల శ్రేణి కలిగిన నాలుగు నౌకల మొత్తం ఖర్చు రూ. 35,000 కోట్లకు పైగా ఉంది.
స్వదేశీ ఉక్కుతో..
ఈ నౌకను స్వదేశీ ఉక్కుతో నిర్మించారు. భారతదేశంలో తయారు చేయబడిన అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఒకటి. 164-మీటర్ల పొడవు , 7,500 టన్నుల పూర్తి-లోడ్ స్థానభ్రంశం & గరిష్ట వేగం 30 నాట్లు. ఇక ప్రాజెక్ట్‌లో సుమారు 75% స్వదేశీ పరిజ్ఞానం ఉంది.
32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్ ..
ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ విశాఖ శత్రువుల పాలిట సింహస్వప్నం. ఐఎన్‌ఎస్ విశాఖ 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు కలిగి ఉంది. ఇది రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్‌ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు.
INS విశాఖపట్నం చైనాను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుందా?
చైనీస్ జలాంతర్గాములకు పోటీగా భారత నావికాదళానికి ఇండో-పసిఫిక్ సామర్థ్యాన్ని విస్తరించింది. చైనా ఇప్పటికే లియానింగ్ మరియు షాన్‌డాంగ్ అనే రెండు క్యారియర్‌లను నిర్వహిస్తోంది మరియు మరో రెండింటిని వేగంగా నిర్మిస్తోంది. US నావికాదళం 11 "సూపర్" 1,00,000-టన్నుల అణుశక్తితో నడిచే వాహకాలను కలిగి ఉంది, వీటిలో ప్రతి ఒక్కటి 80-90 యుద్ధ విమానాలు, ఇతర విమానాలను కలిగి ఉంటాయి. 10 క్యారియర్‌లను దేశానికి చిహ్నాలుగా కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం సెకండ్ హ్యాండ్ 44,500 టన్నుల INS విక్రమాదిత్యలో కేవలం ఒక క్యారియర్‌తో పని చేస్తోంది. కాగా, దేశం యొక్క మొట్టమొదటి 40,000-టన్నుల స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ (IAC) ఆగస్టు 2022లో INS విక్రాంత్ అవనుంది. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ 2027 నాటికి 175 యుద్ధనౌకలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మొత్తం 350 యుద్ధనౌకలు, జలాంతర్గాములతో కూడిన చైనా అమెరికా నౌకాదళాన్ని కూడా అధిగమించింది.
ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక ప్రత్యేకతలు..
పొడవు 164 మీటర్లు
బీమ్ 17.4 మీటర్లు
పరిధి - 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం
డ్రాఫ్ట్ 5.4 మీటర్లు
వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు
బరువు 7,500 టన్నులు
స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం
సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Navy, Ship, Visakhapatnam