Home /News /national /

VIRTUAL SIMS USED IN PULWAMA TERROR ATTACK INDIA ASKS US FOR HELP TO DECODE THEM NK

వర్చువల్ సిమ్ అంటే ఏంటి... పుల్వామా ఉగ్ర దాడిలో ఎలా వాడారు?

పుల్వామా ఉగ్రదాడి (File)

పుల్వామా ఉగ్రదాడి (File)

Pulwama Terror Attack : పుల్వామా దాడిలో ఉగ్రవాదులు వర్చువల్ సిమ్ వాడటం దర్యాప్తు అధికారులను ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పుడు అమెరికా మనకు సాయం చెయ్యాల్సి ఉంది.

స్పాట్‌లో 40 మంది సైనికుల మరణానికి కారణమైన జమ్మూలోని... పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడి సైనిక అధికారులను ఆశ్చర్యంలో పడేసింది. జైషే మహ్మద్ ఉగ్రవాదులు... మన సైన్యం కంటే వేగంగా అప్ గ్రేడ్ అవుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని వాడేసుకుంటున్నారు. ఉగ్ర దాడికి సంబంధించి దర్యాప్తు చేస్తుంటే నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. దాడి చేసేందుకు కారును ఎలా పేల్చాలి? ఎంత పెద్దగా పేలాలి వంటివి డిసైడ్ చేసేందుకు ప్రత్యేక ఎక్స్‌పర్ట్స్ టీం ఇండియాలో ప్రవేశించిందని మొన్నే సైన్యం తెలుసుకుంది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఈ దాడి కోసం ఉగ్ర కేటుగాళ్లు వర్చువల్ సిమ్‌లు వాడారంట. 2008లోనే ఉగ్రవాదులు ఈ టెక్నాలజీ వాడినా... అప్పట్లో మన సైన్యం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి సిమ్‌లే వాడటంతో... వాటిలో ఏ డేటా ఉంది అన్నది తెలుసుకోవడం మనకున్న టెక్నాలజీతో సాధ్యం కావట్లేదు. అందుకే భారత్, అమెరికా సాయం కోరింది. ఉగ్రదాడికి పాల్పడిన ఆదిల్ దార్... వర్చువల్ సిమ్ ద్వారా దాడి సూత్రధారి మదస్సిర్ ఖాన్‌తో టచ్‌లో ఉన్నాడు. వర్చువల్ సిమ్‌తో మాట్లాడాడు, చాట్ చేశాడు. ఇవేవీ మన నిఘా వర్గాలకి తెలియలేదంటే అందుకు కారణం వర్చువల్ సిమ్ములే.

వాట్ ఈజ్ వర్చువల్ సిమ్ : ఇది మనం మొబైళ్లలో వేసుకునే సిమ్ కాదు. అసలిక్కడ సిమ్ అనేదే ఉండదు. మనకు సిమ్ కార్డుతోపాటూ నంబర్ ఇస్తారు కదా. అలాగే... అమెరికాలో కంప్యూటర్లలో అలాంటి నంబర్లు ఇస్తారు. అందువల్ల సిమ్ కార్డుతో పనుండదు. మనకు ఇచ్చిన నంబర్‌ను మనం మొబైల్ నంబర్‌లా వాడుకోవాలంటే... ఆ సర్వీస్ ప్రొవైడర్ యాప్‌ని మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సోషల్ మీడియా అకౌంట్లతో సింక్రనైజ్ చెయ్యాలి. అప్పుడు మనకు ఓ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని ఆ యాప్‌లో ఎంటర్ చెయ్యాలి. అంతే... ఆన్‌లైన్‌లో వర్చువల్ సిమ్ పనిచెయ్యడం మొదలుపెడుతుంది.

మీకు ఎప్పుడైనా +1 తో మొదలైన నంబర్లతో ఏదైనా కాల్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. గుర్తు చేసుకోండి. అలా మొబైల్ నంబర్ల ముందు +1 ఉందంటే అది వర్చువల్ సిమ్ నుంచీ వచ్చిన కాల్ అన్నమాట. ఇలాంటి కాల్స్ అమెరికాలో కామన్ అవుతున్నాయి. ది మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ డైరెక్టరీలో ఇలాంటి నంబర్లు ఉంటాయి. ఇలాంటి నంబర్లతో వచ్చిన కాల్స్ అన్నీ ఉగ్రవాదుల నుంచే వస్తున్నాయని అనుకోవాల్సిన పనిలేదు. అమెరికా ప్రజలు కూడా వర్చువల్ సిమ్‌లు వాడుతున్నారు.

వర్చువల్ సిమ్ డేటా ఇవ్వడం అమెరికాకు మేటరే కాదు. అదేదో త్వరగా ఇచ్చేస్తే... దాన్ని డీకోడ్ చేసి... ఉగ్రవాదులు ఇంకా ఏమేం మాట్లాడుకున్నారో... ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చెయ్యాలనుకుంటున్నారో మనకు తెలిసే అవకాశం ఉంది. తద్వారా వాళ్ల తాటతియ్యొచ్చు.

 

ఇవి కూడా చదవండి :

స్మృతి ఇరానీ అంటే రాహుల్ భయపడుతున్నారా... ఆమెకు అంత సీన్ ఉందా?

29న ఏపీకి ప్రధాని మోదీ... ఏం చెప్తారు... ప్రత్యేక హోదాపై మాట్లాడతారా?

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?

కన్నా, రాయపాటి, శ్రీకృష్ణ... గుంటూరు... నరసారావుపేట ఎంపీ స్థానంలో గెలిచేదెవరు?
First published:

Tags: Jammu and Kashmir, Pulwama Terror Attack, SIM SWAP, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు