మే 12న ఓటు వేసేందుకు సిద్ధమన్న కోహ్లీ... ఓటు వేయడం లేదనే ప్రచారానికి చెక్...

విరాట్ కోహ్లీ ఓటర్ ఐడీకార్డు (Image : Instagram)

ఇప్పటికీ గురుగ్రామ్ లోని పాత అడ్రస్ పేరిట ఓటరు లిస్టులో కోహ్లీ పేరు నమోదై ఉంది. పాత ఓటర్ లిస్టు ఆధారంగానే కోహ్లీ ఓటు వేయనున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఓటు వేయడం లేదంటూ జరిగిన ప్రచారంపై అనవసరంగా రాద్ధాంతం చేశారని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు.

  • Share this:
    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మే 12న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఇన్ స్టా గ్రామ్ లో తన ఓటర్ ఐడీ కార్డును పోస్ట్ చేశాడు. ఇప్పటికే ముంబైలోని వర్లీ నియోజకవర్గంలో నివసిస్తున్న విరాట్ కోహ్లీ గడువులోగా కొత్త ఓటర్ కార్డును నమోదు చేసుకోలేకపోయారని, దీంతో ఈ సారి ఎన్నికల్లో టీమిండియా కెప్టెన్ ఓటు వేసే హక్కు కోల్పోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన కోహ్లీ మే 12న తన పాత నివాసం గురుగ్రామ్‌లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు సిద్ధమేనా ? అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులను ఉద్దేశిస్తూ తన ఫోటో ఐడీ కార్డును పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని సెలబ్రిటీలందరికీ ఓటు హక్కు వినియోగించుకోవాలని సందేశం పంపారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచడంలో భాగస్వామ్యం అందించాలని విఙ్ఞప్తి చేశారు.

    ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లీ ఇటీవలే తన భార్య అనుష్కతో కలిసి ముంబైలో నివాసముంటున్నాడు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు మార్చి 30, 2019 చివరి తేదీ కాగా విరాట్ ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ అతని దరఖాస్తు పెండింగ్ లో పడింది. దీంతో గడువు మించి పోవడంతో విరాట్ కోహ్లీ ఓటు వేయలేకపోతున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే విరాట్ కోహ్లీ మొదటి సారి ఓటు వేయడం లేదు.. ఇప్పటికీ గురుగ్రామ్ లోని పాత అడ్రస్ పేరిట ఓటరు లిస్టులో కోహ్లీ పేరు నమోదై ఉంది. పాత ఓటర్ లిస్టు ఆధారంగానే కోహ్లీ ఓటు వేయనున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఓటు వేయడం లేదంటూ జరిగిన ప్రచారంపై అనవసరంగా రాద్ధాంతం చేశారని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు.
    First published: