• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • VIRAL VIDEO WOMAN SWALLOWS FIRE BALLS NETIZENS LINK THIS VIDEO WITH COVID 19 CURE WATCH VIDEO BUT DONT TRY AT HOME NK

Viral video: ఆమె నిప్పురవ్వలు తింటుంది.... వీడియో చూసి నెటిజన్లు ఏమన్నారంటే...

Viral video: ఆమె నిప్పురవ్వలు తింటుంది.... వీడియో చూసి నెటిజన్లు ఏమన్నారంటే...

ఆమె నిప్పురవ్వలు తింటుంది.... వీడియో చూసి నెటిజన్లు ఏమన్నారంటే... (image credit - twitter)

Viral video: పిల్లలకు ముఖ్య గమనిక... దయచేసి ఇలాంటివి ఇళ్లలో చెయ్యవద్దు అని చెబుతారే అలాంటిదే ఇది. ఐతే... నెటిజన్లు దీని ఫన్ టానిక్ సెట్ చేశారు. ఆ వీడియోని వైరల్ చేసేశారు.

  • Share this:
    Viral video: ఆకలేస్తే అన్నం తింటాం... అలుపొస్తే నిద్రపోతాం... కానీ ఆమె అదో టైపు. ఆకలేస్తే... అన్నమే కాకుండా... నిప్పురవ్వలు కూడా తినేస్తుంది. చాక్లెట్ నోట్లో పెట్టుకున్నట్లు వెలుగుతున్న నిప్పురవ్వల్ని నోట్లో వేసుకొని అలా లొట్టలేస్తూ తింటుంది. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు అని నేను అనను. చాలా షాకింగ్ వీడియోలు చూసీ చూసీ మనకు షాక్‌ని తట్టుకునే రేంజ్ వచ్చేసింది. కరోనాను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు కదా... అంటే వేడి నీరు తాగాలనీ, వేడి నీటితో స్నానం చెయ్యాలనీ... ఇలా చాలా ఉంటున్నాయి కదా... అలాగే ఈ మగువ... వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోంది.

    కుర్చీలో తాపీగా కూర్చున్న ఆమె... టేబుల్‌పై ఓ ప్లేటులో 5 వెలుగుతున్న నిప్పురవ్వలు ఉంచుకుంది. వాటిలో ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. జస్ట్ 30 సెకండ్లలో ఐదూ వేసేసుకుంది. ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు IPS ఆఫీసర్ రూపిన్ శర్మ. ఆమె ఫైర్ బాల్స్ మింగుతున్నప్పుడు సినిమాల్లో లాగా డ్రామాటిక్ మ్యూజిక్ కూడా వాడారు. కరోనా పోవాలని ఇలా ఎవరూ చెయ్యకండి... జస్ట్ వ్యాక్సిన్ వేసుకోండి చాలు అని ఆయన క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో మీరూ ఇక్కడ చూడండి.


    ఇలా చెయ్యకూడదు అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే... ఇలా చెయ్యకూడదు అని మనకు తెలుసు కాబట్టి. మరి ఆమె ఈ ప్రమాదకరమైన ఫీట్ ఎలా చేసింది... ఆమెకు నోరు కాలలేదా... ఎలా మింగేసింది అనే డౌట్ మనకు రావడం సహజం. అదెలాగో తెలియాలంటే... అసలా వీడియో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారో, ఆమె ఏం మింగిందో... అవన్నీ తెలియాలి. అవి తెలియకుండా మనం ఏదేదో ఊహించుకోవడం వేస్ట్.


    మన ఇండియన్స్‌కి ధైర్యం ఎక్కువ. ఇలాంటి ఫీట్లు, సాహసాలు బాగా చేస్తారు. అందుకే ఈ వీడియోకి నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. కరోనా పోవాలంటే చివరకు ఇలా చెయ్యాలా అని కామెడీగా అడుగుతున్నారు. ఇలా ఆమె ఎందుకు చేసిందో గానీ... ఈ వీడియోకీ కరోనాకీ కామెడీ లింక్ పెట్టేస్తున్నారు నెటిజన్లు.

    ఇది కూడా చదవండి: Viral wedding photos: పెళ్లిలో తాళి కట్టించుకున్న వరుడు... నెటిజన్లు ఏమన్నారంటే...

    ఒక్కటి మాత్రం నిజం... ఇలాంటివి చేస్తే... నోరు కాలడమే కాదు... ఆహార గొట్టం కూడా కాలిపోతుంది. ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు