• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • VIRAL VIDEO THESE COUPLE FOLLOW 100 PERCENT COVID 19 RULES FOR THEIR MARRIAGE HELD IN BIHAR WATCH VIDEO NK

Viral Video: ముట్టుకోకుండా పెళ్లి చేసుకున్న వధూవరులు... కరోనా రోజులు మరి...

Viral Video: ముట్టుకోకుండా పెళ్లి చేసుకున్న వధూవరులు... కరోనా రోజులు మరి...

Viral Video: ముట్టుకోకుండా పెళ్లి చేసుకున్న వధూవరులు... కరోనా రోజులు మరి... (image credit - twitter)

Viral Video: కరోనా ఇలా వచ్చి అలా వెళ్లిపోయి ఉంటే బాగుండేదే. కానీ అది వెళ్లట్లేదుగా. అందుకే కరోనా రూల్స్ పాటిస్తూ... పనులు కానిస్తున్నారు. ఆ కొత్త జంటపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

  • Share this:
    Viral Video: కరోనా రోజుల్లో పెళ్లి అంటే కష్టమే. వైరస్ సోకే అవకాశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా వధూవరులు పక్కపక్కనే కూర్చోవాలి. వాళ్లలో ఎవరికి కరోనా ఉన్నా... పక్క వారికి సోకడం గ్యారెంటీ. అసలే కరోనా వైరస్‌కి వాళ్లూ, వీళ్లూ అనే తేడాలు లేవు. అందరికీ సోకుతోంది. సో... పెళ్లి జరగాలి... కానీ కరోనా జాగ్రత్తలు పాటించాలి అని ఆ కొత్త జంట భావించింది. ప్లాన్ ప్రకారం పెళ్లి మొదలైంది. వచ్చిన వాళ్లంతా దూరం దూరంగా ఉండేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. బోలెడు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. దాంతో అందరూ సోషల్ డిస్టాన్స్ పాటించగలిగారు. ఇక పెళ్లి మొత్తం అలాగే జరిగింది. వధూ వరులు కాస్త దూరం మెయింటేన్ చేశారు. కార్యక్రమం మొత్తం ఇలాగే సాగింది.

    చివరకు దండలు మార్చుకోవడానికి కూడా వాళ్లు సోషల్ డిస్టాన్స్ పాటించారు. పెళ్లికూతురు, వరుడు ఇద్దరూ కర్రలతో దండలు పట్టుకొని... మెడలో వేసుకున్నారు. అది చూసి పెళ్లికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. శభాష్... దేశంలోని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలన్నీ ఇలా సోషల్ డిస్టాన్స్‌తో జరిగితే... ఈ కరోనా సమస్యలే ఉండవు కదా అంటున్నారు పెళ్లికి వచ్చిన వారు. ఆ వీడియో మీరూ చూడండి.


    ప్రస్తుతం దేశంలోని వివాహాలపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన కరోనా రూల్స్ ఉన్నాయి. 50 మందికి మించి హాజరు కాకూడదనే కండీషన్ ఉంది. సరే... పెళ్లికి వచ్చిన వారు కరోనా జాగ్రత్తలు పాటిస్తారు గానీ... వధూవరులు కూడా పాటించడ మనం ఎక్కడా చూసి ఉండం. అందుకే ఈ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

    ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. బీహార్‌లోని బెగూసరాయ్‌లో. జనరల్‌గా బీహార్ పేద రాష్ట్రం కాబట్టి... అక్కడ అంతగా కరోనా రూల్స్ పాటించడం కుదరదని మనం అనుకుంటాం. కానీ అలాంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎంత కష్టమైనా రూల్స్ పాటిస్తున్నారు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పెళ్లే అందుకు నిదర్శనం.

    ఇది కూడా చదవండి: Viral video: అమ్మాయిలకు పనిష్మెంట్... గుంజీలు తీయించారు... ఏం తప్పు చేశారంటే...

    ఈ పెళ్లికి 50 మంది మాత్రమే హాజరయ్యారు. వచ్చిన వారందరికీ కరోనా రూల్స్ చెబుతూ... పాంప్లెట్లు ఇచ్చారని తెలిసింది. అందరూ మాస్కులు పెట్టుకున్నారు. వధూవరులు కూడా పెట్టుకున్నారు. దీన్ని బట్టీ మనకు అర్థం అయ్యేది ఒకటే. రూల్స్ పాటించాలి అని మనం అనుకుంటే పాటించగలం. రూల్స్ గీల్స్ జాంతా నై అని అనుకుంటే పాటించం. అంతా మన మనసులోనే ఉంటుంది. కరోనాను ఈ దేశం నుంచి తరిమేయాలా వద్దా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మొత్తానికి ఈ పెళ్లి... వంద శాతం కరోనా రూల్స్ పాటించి జరిగిన పెళ్లిగా చెప్పుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు