హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సామాన్యుడిపై రెచ్చిపోయిన పోలీసు.. హెల్మెట్ పెట్టుకొమ్మంటే అమానుషం.. వైరల్ వీడియో..

సామాన్యుడిపై రెచ్చిపోయిన పోలీసు.. హెల్మెట్ పెట్టుకొమ్మంటే అమానుషం.. వైరల్ వీడియో..

నోటికొచ్చినట్లు దుర్భాషాలాడుతున్న పోలీసు

నోటికొచ్చినట్లు దుర్భాషాలాడుతున్న పోలీసు

Viral video: పోలీసు హెల్మెట్ ను పెట్టుకోకుండానే వెహికిల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసును కోరాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

టూవీలర్ వాహనం మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా... కారులో ప్రయాణించేవారు కూడా విధిగా.. సీటు బెల్టును పెట్టుకొవాలని అధికారులు మోత్తుకుంటుంటారు. కానీ జనాలు మాత్రం ఇప్పటికి అధికారుల మాటలను ఏమాత్రం పట్టించుకోరు. అదే విధంగా.. హెల్మెట్ లను ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. దీంతో అధికారులు హెల్మెట్ లు లేనివారికి జరిమానను విధిస్తుంటారు.

ఇదిలా ఉండగా.. కొన్ని చోట్ల చట్టాలను కాపాడాల్సిన అధికారులు కూడా దాన్ని అతిక్రమిస్తుంటారు. ఇప్పటికే అనేక సంఘటనలను మనం చూశాం. కొందరు అధికారులు ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అధికారులు ఏదైన తప్పులను ఎత్తి చూపితే చాలు.. సామాన్యుడిపై తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులో (Tamil nadu)  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి హెల్మెట్ లేకుండానే వెహికిల్ ను నడిపాడు. అయితే.. దీన్ని ఒక సామాన్యుడు గమనించాడు. అధికారిని హెల్మెట్ ధరించాలని సూచించాడు. అప్పుడు పోలీసు కోపంతో రెచ్చిపోయాడు.

అంతే కాకుండా.. అడిగిన ప్రయాణికుడిని నోటికొచ్చినట్లు దూశించాడు. ‘నీపని నువ్వు చూసుకో అంటూ.. ప్రయాణికుడిని అక్కడ నుంచి వెళ్లగొట్టాడు..’.దీంతో ప్రయాణికుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (social media)  వైరల్ గా (Viral video) మారింది. సదరు పోలీసుపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడులోని (Tamil nadu)  తిరుచ్చిలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఒక వ్యక్తి సింగపూర్ నుంచి తిరుచ్చి వెళ్తున్నాడు. అతడు తిరుచ్చి చేరుకున్నాక.. కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేశారు. అక్కడి మెటల్ డిటెక్టర్ లో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు సిగ్నల్ వచ్చింది. దీంతో పోలీసులు అతడి బ్యాగును వెతికారు. ఈ క్రమంలో అతను తన డ్రాయర్ లో (Under wear)  బంగారాన్ని పేస్టుల రూపంలో అతికించాడు. ఆరకంగా బంగారంను అక్రమంగా రవాణా చేస్తున్నాడు.

దొరికిన బంగారం విలువ దాదాపు.. రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అండర్ వేర్ లో కస్టమ్స్ అధికారులు వ్యక్తి డ్రాయర్ ను తనిఖీ చేయడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Police, Tamilnadu, Viral Video

ఉత్తమ కథలు