కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ టి.వి.అనుపమ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలో ఈనెల 23న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లాకు ఎన్నికల ఏర్పాట్లను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సామగ్రి ఉన్న బరువైన ట్రంకు పెట్టెలను ఓ పోలీసుతో కలిసి స్వయంగా లారీ నుంచి కిందకు దించి తన కార్యాలయం లోపలికి మోసుకెళ్లారు. జిల్లా కలెక్టరన్న అధికార దర్పం లేకుండా..సాదాసీదా వ్యక్తిలా ఆమె సిబ్బందితో పాటుగా ఇలా ట్రంపు పెట్టను మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ వీడియోను పలువురు ‘లైక్’ చేయగా...పలువురు షేర్ చేశారు. ప్రతి అధికారికి ఆమె ఆదర్శమంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలోనూ తన సింప్లిసిటీతో జిల్లా కలెక్టర్ అనుపమ వార్తల్లో నిలిచారు.