నడిరోడ్డుపై సింహాల షికారు...బెంబేలెత్తుతున్న ప్రజలు...

తాజాగా రోడ్డుపైకి సింహాలు వచ్చి అటు ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే నడిరోడ్డుపై సింహాలు తిరగడం చూసిన కొందరు మాత్రం వాటిని తమ కెమేరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం.

news18-telugu
Updated: September 14, 2019, 6:15 PM IST
నడిరోడ్డుపై సింహాల షికారు...బెంబేలెత్తుతున్న ప్రజలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జాతీయ రహదారి పైకి సింహాలు వచ్చిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… గిర్నార్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రానికి చెందిన సింహాలు ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న జునాఘడ్ పట్టణం వీధుల్లోకి చేరుకొని స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రోడ్డుపైకి సింహాలు వచ్చి అటు ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే నడిరోడ్డుపై సింహాలు తిరగడం చూసిన కొందరు మాత్రం వాటిని తమ కెమేరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం. ఇదిలాఉంటే వన్యప్రాణులు ఇలా రోడ్డుపై వస్తే వాటికి కూడా ప్రమాదమే అని వన్యప్రాణి ప్రేమికులు వాపోతున్నారు. తరచూ ఆహారం లభించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందని, వన్యప్రాణులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు కంచె నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com