• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • VIRAL VIDEO KOLKATA BRIDE BREAKS TRADITION TAKES STEERING TO DRIVE HUSBAND TO SASURAL NK GH

Viral Video: అప్పగింతలయ్యాక వధువు ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

Viral Video: అప్పగింతలయ్యాక వధువు ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

అప్పగింతలయ్యాక వధువు ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు (image credit - instagram)

Viral Video: రోజులు మారాయి. ప్రయోజనం లేని కొన్ని పాత సంప్రదాయలకు చెక్ పెట్టి... నయా ప్రపంచంలోకి వెళ్లాల్సిందే అనే భావన మీది అయితే... ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది.

  • Share this:
భారతీయ వివాహాల్లో సంప్రదాయాలకు పెద్ద పీటవేస్తారు. పెళ్లిచూపుల నుంచి అప్పగింతల వరకు అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాలని ఆశిస్తారు. అయితే కాలానికి తగినట్లు కొన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం సంప్రదాయబద్ధంగానే నిర్వహిస్తారు. ముఖ్యంగా అప్పగింతల సమయంలో బరువెక్కిన గుండెతో కన్నీళ్లు కారుస్తూ తల్లిదండ్రులు, బంధుమిత్రులకు వీడ్కోలు పలికి భర్త వెంట నడుస్తారు వధువులు. పరిచయం లేని అత్తగారింటికి తన వేలు పట్టుకుని తీసుకెళ్లి ధైర్యం చెబుతాడు వరుడు. అయితే ఈ ఆచారాలకు చెక్ పెడుతూ కొత్తగా వ్యవహరించింది కోల్‌కతాకు చెందిన ఓ వధువు. వివాహం, అప్పగింతల తర్వాత భర్తనే అత్తగారింటికి తీసుకెళ్లింది. భర్తను కారులో తన పక్కన కూర్చొబెట్టి తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసి మెట్టినింట్లో అడుగుపెట్టింది.

వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన 28 ఏళ్ల స్నేహా సింఘీ, 29 ఏళ్ల సౌగాత్ ఉపాధ్యాయను ఈమధ్యే పెళ్లి చేసుకుంది. తర్వాత విదాయీ(బెంగాలీ సంప్రదాయంలో అప్పగింతలు) సందర్భంలో భర్తకు బదులు తానే ముందడుగు వేసి అతడిని పక్కను కూర్చొపెట్టుకుని కారు డ్రైవ్ చేసింది. అత్తగారింటికి డ్రైవ్ చేస్తూ వెళ్లింది. ఎరుపు రంగు లెహంగా, ఆభరణాలతో ధరించిన ఆమె పూలతో అలంకరించిన ఆ కారును డ్రైవ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అప్పగింతల్లో ఏడుస్తూ వెళ్లే అమ్మాయి ఇలా నవ్వుతూ తానే కార్ నడుపుకుంటూ వెళ్లడం అందరికీ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు ఎక్కగానే సీటు పైకి అనుకోమ్మా అని వరుడు తండ్రి వధువుకు సూచించగా.. పర్లేదు తను మేనేజ్ చేస్తుందని పెళ్లి కుమారుడు తన తండ్రికి చెప్పే మాటలు వీడియోలో రికార్డయ్యాయి. ఆ వీడియో మీరూ చూడండి.ఈ విషయంపై ఆమెను ఓ టీవీ ఇంటర్వ్యూలో అడగ్గా.. దీని గురించి పెళ్లికి నెల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నామని, అతని(భర్త)తో చెప్పగానే నిజంగా బాగుంది.. ట్రై చేద్దామని ప్రోత్సహించాడని స్నేహా తెలిపింది. "వివాహం తర్వాత ఈ విషయం మర్చిపోయాను. ప్యాసింజర్ సీటులో కూర్చోగానే తనే నాకు గుర్తు చేశాడు" అని బదులిచ్చింది. కారు డ్రైవ్ చేయడం ఎంతో సరదాగా అనిపించింది అని ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన భర్తకు డ్రైవింగ్ పెద్దగా రాదని, పెళ్లికి ముందు ఓసారి తను కారు నడిపినప్పుడు తనకు చాలా భయం వేసిందని తెలిపింది. తన మొదటి డేట్ లోనూ అతడిని తానే డ్రాప్ చేసినట్లు గుర్తుకుతెచ్చుకుంది.

ఇది కూడా చదవండి: CD Case: కర్ణాటక రాసలీలల సీడీ కేసులో మరో మలుపు... కోర్టు మెట్లెక్కుతున్న యువతి

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. "ఈమె ట్రెండ్ సెట్టర్" అని ఒకరు పోస్ట్ చేయగా.. "చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది" అని మరొకరు స్పందించారు. ఆమెను చూస్తేంటే గర్వంగా ఉందని ఇంకొకరు పోస్ట్ చేశారు. అయితే వివాహ వస్త్రాల్లో డ్రైవింగ్ సీటులో వరుడితో పాటు కారు నడపడం విభిన్నమైన ఆలోచన అని చాలా మంది తమ స్పందనను సోషల్ మీడియాలో చెబుతున్నారు.
Published by:Krishna Kumar N
First published: