Home /News /national /

VIRAL VIDEO HUNDREDS OF UN MASKED TOURISTS ENJOY KEMPTY WATERFALL IN MUSSOORIE NETIZENS FIRE AFTER WATCHING VIRAL VIDEO NK

Viral video: జలపాతం దగ్గర మాస్క్ లేకుండా స్నానాలు. ఇలాగైతే థర్డ్‌వేవ్ తప్పదన్న నెటిజన్లు

Viral video: జలపాతం దగ్గర మాస్క్ లేకుండా స్నానాలు. ఇలాగైతే థర్డ్‌వేవ్ తప్పదన్న నెటిజన్లు (image credit - instagram)

Viral video: జలపాతం దగ్గర మాస్క్ లేకుండా స్నానాలు. ఇలాగైతే థర్డ్‌వేవ్ తప్పదన్న నెటిజన్లు (image credit - instagram)

Viral video: ఇండియాలో సెకండ్ వేవ్ ఇంకా తగ్గనేలేదు... అప్పుడే చాలా మంది మాస్కులను పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ టూరిస్టుల వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

    Viral video: మాస్క్ పెట్టుకోండి మహాప్రభో అని ప్రపంచమంతా వేడుకుంటుంటే... కొంతమంది మాత్రం... అవసరం లేదు... కరోనా మమ్మల్ని ఏమీ చెయ్యలేదంటూ చెలరేగిపోతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతం ముస్సోరిలో... కెంప్టీ జలపాతం దగ్గర (Kempty Waterfall) పర్యాటకులు చేసిన హంగామా నెట్టింట వైరల్ అయ్యింది. అందులో వందల మంది టూరిస్టులు... మాస్క్ లేకుండా... సేఫ్ డిస్టాన్స్ అన్నదే పాటించకుండా... గుమికూడి మరీ స్నానాలు చేశారు. పర్యాటకులతో జలపాతం సందడిగా మారింది.

    ఇదే కాదు... దేశంలోని చాలా టూరిజం ప్రదేశాల్లో కరోనా రూల్స్ సడలించడంతో... టూరిస్టులు జోరుగా వెళ్తున్నారు. వెళ్లడం తప్పుకాదుగానీ... కరోనా ప్రోటోకాల్ పాటిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ అలా పాటించడం మర్చిపోతుండటమే సమస్య అవుతోంది. పర్యాటకాన్ని ఎంజాయ్ చెయ్యాలనే ఆలోచనలో... కరోనా సంగతి మర్చిపోతున్నారు. తిరిగి వారంతా తమ తమ ఇళ్లకు వెళ్లినప్పుడు... వారికి కరోనా ఉంటే... వారి ద్వారా ఇళ్లలో వారికి కరోనా సోకే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా... ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కి పెద్ద సంఖ్యలో వస్తున్న టూరిస్టులు... ప్రోటోకాల్ పాటించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

    ముస్సోరీ, నైనిటాల్‌లోని... హాలిడే డెస్టినేషన్లు పర్యాటకులతో నిండిపోయాయి. అక్కడి హోటల్స్ బుక్ చేసుకోవడానికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు. అందువల్ల మరో 2 వారాల తర్వాత ఇండియాలో కరోనా కేసులు జోరుగా పెరగవచ్చనే అంచనా ఉంది. ముఖ్యంగా కెంప్టీ జలపాతానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే థర్డ్ వేవ్ రావడం ఖాయం అంటున్నారు. ప్రభుత్వాలు ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by So Delhi (@sodelhi)






    ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియో... క్రమంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల లోనూ వైరల్ అయ్యింది. అప్పుడే కరోనాను మర్చిపోయారా... అది తీసుకుపోయిన ప్రాణాలు గుర్తులేవా, ఆక్సిజన్ సమస్యలు, రెమ్‌డెసివర్ బ్లాక్ మార్కెట్ ఎలా మర్చిపోగలుగుతున్నారు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంప్టీ బ్రెయిన్స్ ఎట్ కెంప్టీ ("Empty brains at Kempty") అనే కామెంట్ చాలా మందికి నచ్చుతోంది.

    ఇది కూడా చదవండి: Horoscope 10-7-2021: ఈ రాశుల వారికి మంచి ఫలితాలు... కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

    ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు, మరణాలూ మళ్లీ పెరుగుతున్నాయి. తగ్గాల్సిన సమయంలో అవి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్లు జోరుగా వేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గకపోవడం షాకింగ్ విషయమే.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Coronavirus, Covid-19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు