• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • VIRAL VIDEO A BUFFALO FIGHTS A LION STRONG TO SAVE HIS TEAM VIDEO GIVES THRILLING MESSAGE TO NETIZENS WATCH IT NK

Viral video: సింహంతో పోరాడిన గేదె... తోటి గేదెలను కాపాడి... వీడియో చూడండి

Viral video: సింహంతో పోరాడిన గేదె... తోటి గేదెలను కాపాడి... వీడియో చూడండి

సింహంతో పోరాడిన గేదె... తోటి గేదెలను కాపాడి... (image credit - twitter)

Viral video: ఆ గేదె పోరాటపటిమ నెటిజన్లకు బాగా నచ్చింది. ఎవరైనా సరే... కష్టాల్లో ఉంటే... పోరాడాలి తప్ప... తలదించకూడదు అంటున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:
    Viral video: మనుషుల్లోనే కాదు... జంతువుల్లోనూ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎలాగైతే తన వారికి కష్టం రాకుండా నాయకుడు ముందుండి తనపై భారం వేసుకుంటాడో... అదే విధంగా జంతువుల్లో కొన్ని... తమ గుంపును కాపాడుకునేందుకు పోరాటం చేస్తాయి. ఆటవిక రాజ్యంలో బలం ఉన్న జంతువుదే పై చేయి. ఈ కారణంగానే రోజూ జింకలు, దుప్పుల వంటివి సింహాలు, పులులకు ఆహారం అయిపోతూ ఉంటాయి. అడవిలో అది సహజ ధర్మం. ఐతే... బలహీనమైన జంతువులు ప్రాణాలు కాపాడుకునేందుకు చివరి క్షణం వరకూ పోరాడుతాయే తప్ప... ఆత్మహత్యలు చేసుకోవు, శత్రువుకు తలవంచవు. అందుకే ఆ పోరాటం చాలా మందికి చైతన్యం తెస్తుంది.

    ఈ వీడియోలో... కొన్ని గేదెలు గడ్డి మేస్తూ ఉండగా... దూరం నుంచి ఓ సింహం పరుగున వచ్చింది. దాన్ని చూడగానే గేదెలు షాక్ అయ్యాయి. అంతలో ఓ గేదె సింహానికి ఎదురు తిరిగింది. సింహాన్ని పరుగులు పెట్టించింది. తన కొమ్ములతో... సింహంవైపు ఉరికింది. దాంతో... మిగతా గేదెలు... ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెత్తి పారిపోయాయి. అలా తమ గుంపును కాపాడిన ఆ గేదె... సింహం నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గం వైపు పరుగు పెట్టింది. కానీ గేదెలు అంత వేగంగా పరుగెత్తలేవు కదా... సింహం దాని పైకి ఎక్కి పంజా విసిరింది. ఆ గేదె పోరాటం మొదలుపెట్టింది. సింహాన్ని తన పై నుంచి కింద పడేలా చేసింది. అయినా ఆ సింహం వదల్లేదు. ఈసారి దవడను కొరికి... తలను బలంగా పట్టుకుంది. గేదె ఎంతలా ప్రయత్నించినా సింహం వదల్లేదు. నేలపై ఈడ్చినా సింహం వదల్లేదు. ఇలా చాలా సేపు పోరాడిన గేదె... చివరకు ఓటమి చూడక తప్పలేదు. ఆ వీడియో మీరూ చూడండి.



    ఇది కూడా చదవండి: Viral video: వలలో చేప చిక్కింది అనుకున్నాడు.. తీరా చూస్తే మొసలి... ఆ తర్వాత...

    తమ గుంపును కాపాడేందుకు ఈ గేదె చేసిన పోరాటం నెటిజన్లకు నచ్చుతోంది. నాయకుడంటే అలా ఉండాలి అంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. "మనం కూడా ఇలాగే పోరాడాలి. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం దిశగా ప్రయత్నించాలే తప్ప... మన వల్ల కాదని ముందే చేతులెత్తేయకూడదు" అని నెటిజన్లు కోరుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: