ఆ వైరల్ మెసేజ్ ఫేక్.. అందులో నిజం లేదు : ఆర్‌బీఐ

RBI Clarification on Viral Message : ఆర్‌బీఐ తమ ఉద్యోగుల లీవులను రద్దు చేసిందన్న మెసేజ్ వైరల్ కాగానే రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. నోట్ల రద్దు తరహాలో ఆర్‌బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరిగింది.

news18-telugu
Updated: August 20, 2019, 9:28 AM IST
ఆ వైరల్ మెసేజ్ ఫేక్.. అందులో నిజం లేదు : ఆర్‌బీఐ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతుందని.. ఇందుకోసం ఉద్యోగుల లీవులను రద్దు చేస్తోందని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే ఇదంతా వట్టి ఫేక్ అని ఆర్‌బీఐ కొట్టిపారేసింది. ఆర్‌బీఐ పేరిట వైరల్ అవుతోన్న ఈ మెసేజ్‌లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. లీవుల రద్దుకు సంబంధించి ఆర్‌బీఐ యాజమాన్యం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. ఆర్‌బీఐ తమ ఉద్యోగుల లీవులను రద్దు చేసిందన్న మెసేజ్ వైరల్ కాగానే రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. నోట్ల రద్దు తరహాలో ఆర్‌బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందన్న ప్రచారం జరిగింది. బహుశా రూ.2000 నోటును రద్దు చేస్తారేమోనన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే స్వయంగా దీనిపై ఆర్‌బీఐ క్లారిటీ ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు తెరపడినట్టయింది.First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు